Andhra Pradesh: కిలాడీ పేకాట రాయుళ్లు.. రైడ్ చేసేందుకు వెళ్లిన ఎస్‌ఐని దొంగ అంటూ చితకబాదారు

AP Crime News: పశ్చిమగోదావరి జిల్లాలో పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు. తాడేపల్లిగూడెం ఉల్లిపాయల జట్టు కార్మికులు పట్టణ శివారులోని పడాల దాటిన తర్వాత ముత్యాలమ్మ గుడి వద్ద ఓ వేడుకలో నగదుతో పేకాట ఆడుతున్నారు.

Andhra Pradesh: కిలాడీ పేకాట రాయుళ్లు.. రైడ్ చేసేందుకు వెళ్లిన ఎస్‌ఐని దొంగ అంటూ చితకబాదారు
Attack On Si
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 14, 2022 | 4:32 PM

West Godavari district: పశ్చిమగోదావరి జిల్లాలో పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు. తాడేపల్లిగూడెం ఉల్లిపాయల జట్టు కార్మికులు పట్టణ శివారులోని పడాల దాటిన తర్వాత ముత్యాలమ్మ గుడి వద్ద ఓ వేడుకలో నగదుతో పేకాట ఆడుతున్నారు. కార్మికులు 50 మందికి పైగా ఉండడంతో రైడ్‌కు వచ్చిన ఎస్ఐ, సిబ్బందిపై వారు తిరగబడ్డారు. ఘటనలో ఎస్‌ఐ సహా పలువురు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో తాడేపల్లిగూడెం రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తారకేశ్వర్, సంతోష్‌ మఫ్టీలో అక్కడికి చేరుకున్నారు. ఒక కానిస్టేబుల్ శ్రీను మాత్రం పోలీసు డ్రెస్ లో ఉన్నారు.  సాధారణంగా ఇటువంటి సమాచారంలో దాడులకు వెళ్ళేవారు మఫ్టీలో వెళ్తారు. దీంతో సివిల్ డ్రస్‌లోనే పోలీసులు అక్కడికి వెళ్లారు.  స్పాట్‌కు చేరుకున్న పోలీసులు..పేకాట స్థావరం వద్ద డబ్బులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా.. దొంగా దొంగా అంటూ కొందరు ఎస్ఐపై దాడికి యత్నించారు. తాను ఎస్సైను అని చెబుతున్నా వినకుండా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. వీరిలో కొంతమంది మద్యం సేవించి ఉన్నారని తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ తెలిపారు. సంఘటనా స్థలానికి తాడేపల్లిగూడెం(Tadepalligudem) పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల రఘు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఒక పోలీస్ అధికారిపై ఈ విధంగా దాడి చేయడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. 24 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి  టూవీలర్‌ వాహనాలు, సెల్ ఫోన్లు, దాదాపు 74 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై దాడికి  పాల్పడటాన్ని ఓ పోలీసు కానిస్టేబుల్ వీడియో చిత్రీకరిస్తుండగా అతనిపై కూడా దాడి చేశారు.

Also Read: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో

డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్‌ అడిగిన ఐఏఎస్‌..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!