Vijayawada News: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. డబ్బులు ఇవ్వలేదని పేషెంట్‌తో అమానుషంగా..

సాధారణంగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోలేని వారు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తారు. ప్రైవేటులో అధిక డబ్బులు వెచ్చించాల్సి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ కు వెళ్తుంటారు....

Vijayawada News: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. డబ్బులు ఇవ్వలేదని పేషెంట్‌తో అమానుషంగా..
Vijaya Ggh 1
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 14, 2022 | 4:08 PM

సాధారణంగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోలేని వారు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తారు. ప్రైవేటులో అధిక డబ్బులు వెచ్చించాల్సి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ కు వెళ్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స, సౌకర్యాలు, సదుపాయాలు, మందులు, పరీక్షలు వంటివి ఉచితంగానే అందుతుండటంతో కష్టమైనా.. అక్కడే వైద్యం చేయుంచుకుంటారు. అయితే ప్రభుత్వాసుపత్రుల్లోనూ కొందరు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తుంటారు. డబ్బులు ఇవ్వాలని రోగిని, వారి సహాయకులను ఇబ్బంది పెట్టడం వంటి ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా విజయవాడలో ఇలాంటి ఘటనే జరిగింది. షుగర్ వ్యాధితో కాలు తొలగించిన ఓ మహిళను వీల్ ఛైర్ పై తీసుకువెళ్లేందుకు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే గానీ.. వీల్ ఛైర్ ఇవ్వమని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక రోగి సహాయకురాలు బాధితురాలిని చేతులపైనే మోసుకెళ్లారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ స్పందించారు.

విజయవాడ(Vijayawada) ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వలేదని రోగికి ఆస్పత్రి(Vijayawada Govt Hospital) సిబ్బంది వీల్ ఛైర్ ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక రోగి సహాయకులు మహిళను చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లారు. నగరంలోని డోలాస్ నగర్ కు చెందిన సామ్రాజ్యం అనే మహిళకు షుగర్ వ్యాధి కారణంగా వైద్యులు కాలు తొలగించి ఆపరేషన్ చేశారు. కుట్లు తీయించుకునేందుకు మహిళను బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే బాధితురాలిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి, తీసుకువచ్చేందుకు వీల్ ఛైర్ ఇవ్వడానికి రెండు వందల రూపాయలు అడిగారని మహిళ బంధువులు తెలిపారు. దీంతో అంత డబ్బు ఇచ్చే స్తోమత లేక చేతులపైనే పేషెంట్ ను తీసుకెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలిపారు. రోగి బంధువుల వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వారిని గుర్తించి, సస్పెండ్ చేస్తామని వెల్లడించారు. హాస్పిటల్ లో సరిపడా వీల్ ఛైర్లు, స్ట్రెక్చర్ లు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీచదవండి.

Anurag Thakur vs KCR: పాకిస్తాన్ మాటల్లా ఉన్నాయి.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి..

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. వేదికపై కుప్పకూలిన వధువు.. డాక్టర్ల సలహాతో అవయవదానం

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌..!