AP Crime: అదనపు కట్నానికి తల్లీ, కుమార్తె మృతి.. హత్యా..? ఆత్మహత్యా..?
తల్లి లేని కుమార్తె అని అల్లారుముద్దుగా చూసుకున్నాడు. తాను కష్టపడ్డా.. తన కూతురు సుఖంగా జీవించాలని కలలు కన్నాడు. తన తాహతుకు మించి కట్నకానుకలు ఇచ్చి...
తల్లి లేని కుమార్తె అని అల్లారుముద్దుగా చూసుకున్నాడు. తాను కష్టపడ్డా.. తన కూతురు సుఖంగా జీవించాలని కలలు కన్నాడు. తన తాహతుకు మించి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. కన్న బిడ్డకు ఘనంగా పెళ్లి చేశానన్న ఆనందం ఆతనిలో ఎక్కువ కాలం నిలవలేదు. కూతురికి పెళ్లైన కొద్ది రోజుల నుంచి ఆమె అత్తామామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. దీంతో 20 లక్షలు రూపాయలు అదనంగా ఇచ్చారు. అయినా వారి శాడిజం శాంతించలేదు. అమ్మాయి పుట్టిందన్న కారణంతో మళ్లీ వేధింపులు ప్రారంభించారు. ఈ క్రమంలో వివాహిత, తన కూతురు ఓ గదిలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నారు. అదనపు కట్నం కోసం అత్తింటివారే తన కూతురిని హతమార్చారని మృతురాలి తండ్రి బోరున విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కర్నూలు జిల్లా బేతంచెర్ల సుంకులాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వేరుశనగ వ్యాపారం చేసేవారు. తనకు భార్య లేకున్నా కుమార్తెను అల్లారుముద్దుగా పెంచి ఇంజినీరింగ్ చదివించారు. కుమార్తె జీవితం బాగుంటుందన్న ఆశతో తన స్థోమతకు మించి కట్నకానుకలు ఇచ్చి పాత కల్లూరులోని వ్యాపార కుటుంబానికి చెంందిన తరుణ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.10 లక్షలు నగదు, 30 తులాల బంగారం ఇచ్చారు. కొన్నాళ్ల తరువాత మరింత కట్నం కావాలని, అత్తింటి వారు కోరడంతో మరో రూ.20 లక్షలు ఇచ్చారు.
ఈ క్రమంలో పుష్పలతకు ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టడంతో మరికొంత సొమ్ము ఇవ్వాలని అత్తమామలు వేధించేవారు. వారి వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చిన పుష్పలత.. పది రోజుల కిందటే అత్తారింటికి వెళ్లింది. శనివారం పామిడిలోని భోగేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం చేయించి చిన్నారికి మోక్షిత అని పేరు పెట్టారు. ఇంతలోనే ఆదివారం ఉదయం తల్లీకూతుళ్లు ఇంటి మేడపై గదిలో విగత జీవులుగా పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. భర్త తరుణ్, అత్త లక్ష్మీదేవి, మామ ఓబుళేసు, ఇతడి అల్లుడు హరిని అడిగి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
తల్లీకుమార్తెల అనుమానాస్పద మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పుష్పలత కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దసంఖ్యలో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. అంబులెన్స్ వాహనాన్ని ఇంటి లోపలికి వెళ్లనీయకుండా గేట్లను మూసివేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టానికి వెళ్లనీయమని స్పష్టం చేశారు. పోలీసులు నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు.
Also Read
Hyderabad: 16 ఏళ్లుగా పోలీసులకు చుక్కలు.. 70వేల ఫోన్ నంబర్స్ సెర్చ్.. ఫైనల్‌గా చిక్కాడు
AP Crime: వ్యాయామ ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. కోరిక తీరిస్తే కోరుకున్నది ఇస్తానని..