ఆదిలాబాద్ జిల్లాలో కులబహిష్కరణ కలకలం.. 12 కుటుంబాల వెలివేత
ప్రస్తుతం ప్రపంచం ఆధునీకీకరణ వైపు పరుగులు పెడుతున్నా... మారుమూల ప్రాంతాల్లో కులవివక్ష జాఢ్యం తన ఉనికిని చూపుతునే ఉంది. తమ కంటే తక్కువ కులానికి చెందిన వారని, ఒకే కులంలో...
ప్రస్తుతం ప్రపంచం ఆధునీకీకరణ వైపు పరుగులు పెడుతున్నా… మారుమూల ప్రాంతాల్లో కులవివక్ష జాఢ్యం తన ఉనికిని చూపుతునే ఉంది. తమ కంటే తక్కువ కులానికి చెందిన వారని, ఒకే కులంలో ఏర్పడే విభేదాలు మానవ సంబంధాలను చెరిపేస్తోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కులబహిష్కరణ కలకలం రేపింది. ఖోడద్ గ్రామంలోని 12 మత్స్యాకార కుటుంబాలపై సంఘం పెద్దలు కులబహిష్కరణ వేటు వేశారు. మూడేళ్లుగా నరకం చూసిన బాధితులు, ఇక వేధింపులు తాళలేక టీవీ9 ను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బాధితుల పరిస్థితిని చూసి చలించిన టీవీ9.. ఈ ఘటనపై కులపెద్దలను వివరణ కోరింది. అయితే వారి నుంచి నిర్లక్ష్యపూరిత సమాధానం రావడం గమనార్హం.
తెలంగాణలోని ఆదిలాబాద్(Adilabad) జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో 12 మత్స్యకార కుటుంబాలపై సంఘ పెద్దలు కుల బహిష్కరణ వేటు వేశారు. గ్రామంలో 72 కుటుంబాల్లో 12 కుటుంబాలను వెలివేశారు. వారు శుభకార్యాలకు, చావులకు వెళ్లకూడదని సంఘం పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో వారి వేధింపులు ఎక్కువయ్యాయని, మూడేళ్లుగా నరకం చూస్తున్నామని బాధితులు టీవీ9 ను ఆశ్రయించారు. కుల బహిష్కరణ విషయంలో ఖోడద్ మత్స్యకార సంఘం పెద్దలను టీవీ9 ఆరా తీయగా.. తాము వారిని కుల బహిష్కరణ చేయలేదని, సంఘ భవనం నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని, అందుకే ఆ 12 కుటుంబాలను దూరంగా ఉంచామని చెప్పారు. కులంలో తిరిగి చేరాలంటే జరిమానా కట్టాల్సిందేనని వెల్లడించడం గమనార్హం.
ఇవీ చదవండి..
Visakhapatnam: అయ్యో తల్లి ఎంత పని చేశావమ్మా.. పాపం అన్నెం పున్నెం తెలియని చిన్నారులు..!
ఉక్రెయిన్ పై దాడికి రష్యా సమాయత్తం.. అప్పటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం వరకు జరిగిందిదే..
Andhra Pradesh: కిలాడీ పేకాట రాయుళ్లు.. రైడ్ చేసేందుకు వెళ్లిన ఎస్‌ఐని దొంగ అంటూ చితకబాదారు