ఎమ్మెన్నెస్ నేత దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పదాధికారి జమీల్ షేక్ దారుణ హత్యకు గురయ్యడు. బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో జమీల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

  • uppula Raju
  • Publish Date - 11:06 am, Tue, 24 November 20
ఎమ్మెన్నెస్ నేత దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పదాధికారి జమీల్ షేక్ దారుణ హత్యకు గురయ్యడు. బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో జమీల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

థానే రాబోడిలోని బిస్మిల్లా హోటల్ ప్రాంతంలో మధ్యాహ్నం జమీల్ షేక్ బైక్‌పై వెళుతున్నాడు. వెనుక నుంచి వచ్చిన దుండగుడు జమీల్‌పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో బుల్లట్ నేరుగా జమీల్ తలలోకి దూసుకెళ్లింది. వెంటనే కుప్ప కూలిపోయిన జమీల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జమీల్‌ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెన్నెస్ పదాధికారులు అవినాష్ జాదవ్, రవీంద్ర మోరే, డీసీపీ అవినాష్ అబురే, క్రైం డీసీపీ లక్ష్మికాంత్ పాటిల్, అసిస్టెంట్ కమిషనర్ నీతా పాడవి తదితర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. థానేలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే జమీల్ షేక్ రాబోడిలో క్లస్టర్ యోజనను ఎమ్మెన్నెస్ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఈ కారణంగానే హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు హంతకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.