ఐదు నెలల గర్భిణీతో అక్రమ సంబంధం.. ఆపై దారుణంగా హత్య..

భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళను నమ్మించి గొంతుకోశాడు ఓ దుర్మార్గుడు. ఐదునెలల గర్భిణి అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని తెలిసింది. గుజరాత్‌లోని బర్దోలీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దోలీకి చెందిన రష్మీ కటారియా అనే మహిళ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉంది. […]

ఐదు నెలల గర్భిణీతో అక్రమ సంబంధం.. ఆపై దారుణంగా హత్య..
Follow us
uppula Raju

|

Updated on: Nov 24, 2020 | 10:36 AM

భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళను నమ్మించి గొంతుకోశాడు ఓ దుర్మార్గుడు. ఐదునెలల గర్భిణి అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని తెలిసింది. గుజరాత్‌లోని బర్దోలీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బర్దోలీకి చెందిన రష్మీ కటారియా అనే మహిళ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉంది. అయితే స్థానికంగా ఉండే చిరాగ్ పటేల్ రష్మీ ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. నెమ్మదిగా మాటలు కలిపి అండగా ఉంటానని నమ్మించాడు. దీంతో రష్మీ అతడితో సహజీవనం ప్రారంభించింది. అయితే ఆదివారం నుంచి రష్మీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా చిరాగ్‌తో తన కూతురు సహజీవనం చేస్తోందని ఆమె తల్లి పోలీసులకు తెలిపింది. అతడే తన కూతురిని ఏమైనా చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే పోలీసులు చిరాగ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇద్దరి మధ్య గొడవల కారణంగా రష్మీని తానే హత్య చేసినట్లు చిరాగ్ ఒప్పుకున్నాడు. జేసీబీ సాయంతో మృతదేహాన్ని తన తండ్రి ఫాం హౌజ్‌లో పూడ్చిపెట్టినట్లు తెలిపాడు. అయితే ఈ హత్యకు చిరాగ్ భార్య కూడా సహకరించిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆమె రష్మీపై దాడికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫాం హౌజ్‌లో తవ్వకాలు జరిపిన పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.