జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన.. అనుమానంతో అల్లుడిని సజీవ దహనం చేసిన అత్తింటి వారు
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. అల్లుడిని అత్తింటివారు సజీవ దహనం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అల్వాల్‌కి చెందిన పాగిళ్ల పవన్ కుమార్

Software engineer assassinate: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. అల్లుడిని అత్తింటివారు సజీవ దహనం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అల్వాల్‌కి చెందిన పాగిళ్ల పవన్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి బల్వంతపూర్‌కి చెందిన కృష్ణవేణితో వివాహం జరిగింది. కృష్ణవేణి సోదరుడు జగన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో అత్తింటి కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ అక్కడికి వెళ్లాడు. అయితే గతంలో జగన్, పవన్ మధ్య గొడవలు జరిగాయి. (స్పీడు మీదున్న శర్వానంద్.. బైలింగ్వవల్ మూవీ షూటింగ్ పూర్తి.. ఫొటో షేర్ చేసిన నటుడు)
ఈ క్రమంలో జగన్ మృతికి పవన్‌నే కారణమన్న అనుమానంతో తన సోదరి భార్య సుమలత తన భర్తను చంపేసిందని కృష్ణవేణి ఆరోపణలు చేస్తోంది. నీళ్లు తెమ్మని తనను బయటికి పంపి, తన భర్తను గదిలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. (మూడు సినిమాలను ఖరారు చేసిన సూర్య.. లైన్‌లో మరో ఇద్దరు.. ఆ డైరెక్టర్‌తో నో ఇష్యూస్..!)



