స్పీడు మీదున్న శర్వానంద్‌.. బైలింగ్వవల్‌ మూవీ షూటింగ్ పూర్తి.. ఫొటో షేర్ చేసిన నటుడు

యువ హీరో శర్వానంద్‌ ఫుల్ స్పీడులో ఉన్నారు. సినిమాలను ఒప్పుకోవడమే కాదు వాటిని ఆలస్యం లేకుండా పూర్తి చేస్తున్నాడు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:52 pm, Tue, 24 November 20
స్పీడు మీదున్న శర్వానంద్‌.. బైలింగ్వవల్‌ మూవీ షూటింగ్ పూర్తి.. ఫొటో షేర్ చేసిన నటుడు

Shawanand 30 shooting wrapped: యువ హీరో శర్వానంద్‌ ఫుల్ స్పీడులో ఉన్నారు. సినిమాలను ఒప్పుకోవడమే కాదు వాటిని ఆలస్యం లేకుండా పూర్తి చేస్తున్నాడు. తాజాగా తన 30వ సినిమాను శర్వా కంప్లీట్ చేశాడు. తమిళ డైరెక్టర్‌ శ్రీ కార్తిక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన శర్వా.. కొన్ని ఫొటోలను షేర్ చేసుకున్నారు. కాగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ మూవీని నిర్మించగా.. ఇందులో శర్వా సరసన రీతూ వర్మ నటించారు. అమలా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్‌ డైలాగ్‌లు అందించారు. (క్యాన్సర్‌ రోగుల కోసం జుట్టును దానం చేసిన హీరో ధృవ‌.. కొత్త లుక్‌లో వావ్‌ అనిపిస్తోన్న యాక్షన్‌ కింగ్‌ మేనల్లుడు)

ఇక ప్రస్తుతం కిశోర్‌ దర్శకత్వంలో శ్రీకారంలో నటిస్తున్నారు శర్వా. ఇందులో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన భలేగుంది బాల అనే పాట అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తరువాత శర్వా అజయ్‌ భూపతి దర్శకత్వంలో మహాసముద్రంలో నటించనున్నారు. శర్వాతో పాటు సిద్దార్థ్‌, అను ఇమ్మాన్యుల్‌, అదితీ రావు హైదారీలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. (మూడు సినిమాలను ఖరారు చేసిన సూర్య.. లైన్‌లో మరో ఇద్దరు.. ఆ డైరెక్టర్‌తో నో ఇష్యూస్‌..!)

https://www.instagram.com/p/CH9pO43JVSk/?utm_source=ig_embed