మూడు సినిమాలను ఖరారు చేసిన సూర్య.. లైన్‌లో మరో ఇద్దరు.. ఆ డైరెక్టర్‌తో నో ఇష్యూస్‌..!

సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా)తో మంచి హిట్‌ని ఖాతాలో వేసుకున్నారు సూర్య. సుధాకొంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూర్య కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది

  • Tv9 Telugu
  • Publish Date - 2:09 pm, Tue, 24 November 20
మూడు సినిమాలను ఖరారు చేసిన సూర్య.. లైన్‌లో మరో ఇద్దరు.. ఆ డైరెక్టర్‌తో నో ఇష్యూస్‌..!

Suriya next movies: సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా)తో మంచి హిట్‌ని ఖాతాలో వేసుకున్నారు సూర్య. సుధాకొంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూర్య కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా నటనలో సూర్యను మరోస్థాయికి చేర్చింది. ఓటీటీలోనే ఈ మూవీ పెద్ద విజయం సాధించగా.. థియేటర్‌లలో వచ్చి ఉంటే ఈ సినిమాకు క్రేజ్‌ మరోలా ఉండేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ప్రస్తుతం సూరారై పొట్రు హిట్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న సూర్య.. మూడు సినిమాలను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అందులో పాండిరాజ్‌, హరి, వెట్రిమారన్ ఉన్నారు. ఈ మూడు సినిమాలపై అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ ముగ్గురితో పాటు మణిరత్నం నిర్మిస్తోన్న నవరస వెబ్‌సిరీస్‌లో సూర్య నటిస్తున్నారు. సూర్య నటిస్తోన్న పార్ట్‌కి గౌతమ్‌ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉంటే గౌతమ్‌ మీనన్‌, విక్రమ్‌ కుమార్‌లతో సినిమాలు కూడా లైన్‌లో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే సూర్య, హరి ప్రాజెక్ట్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మూవీ ఫైనల్‌ స్క్రిప్ట్‌ సూర్యకు నచ్చలేదని టాక్ నడిచింది. దానికి తోడు సూర్య.. తన సినిమా సూరారై పొట్రును ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో.. అతడిపై హరి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సూర్య-హరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే మూవీకి బ్రేక్ పడ్డట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లేనని తెలుస్తోంది.