కావ్య పాప కూడా మొదలెట్టేసిందిగా.. అదరగొట్టిన బలగం బ్యూటీ

TV9 Telugu

26 April 2024

చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో నటించి మెప్పించింది బబ్లీ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ..హీరోయిన్ గా మారిన తర్వాత మాత్రం ఛాన్సులు రావడం లేదు.

మసుధా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. హీరోయిన్ గా తొలి సినిమాతో ఆకట్టుకుంది. 

ఆతర్వాత బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. బలగం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 

ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ తన నటనతో ఆకట్టుకుంది. కానీ ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. 

దాంతో ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది కావ్య. 

తాజాగా అందాలతో అదరగొడుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావ్య ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు.