Tamil Nadu: తమిళనాడులో దారుణం.. ఎంఎన్ఎంకే పార్టీ ముఖ్య నేత దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి..
Tamil Nadu: తమిళనాడులోని వెల్లూరు జిల్లా వాణియంబాడిలో దారుణం చోటు చేసుకుంది. పట్టపడగలే నడిరోడ్డుపై ఎంఎన్ఎంకే పార్టీ ముఖ్య నేతను కత్తులతో నరికి చంపారు పలువురు దుండగులు.
Tamil Nadu: తమిళనాడులోని వెల్లూరు జిల్లా వాణియంబాడిలో దారుణం చోటు చేసుకుంది. పట్టపడగలే నడిరోడ్డుపై ఎంఎన్ఎంకే పార్టీ ముఖ్య నేతను కత్తులతో నరికి చంపారు పలువురు దుండగులు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ నేత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భీకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంఎన్ఎంకే పార్టీకి చెందిన కీలక నేత వసీం అక్రమ్.. వాణియంబాడిలోని జీవ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే, వాణియంబాడిలో గంజా గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. దాంతో వారి ఆ గ్యాంగ్ ఆగడాలపై కొంత కాలంగా వసీం అక్రమ్ పోరాడుతున్నారు. ఇలా స్థానికంగా ఉన్న ఇంతియాజ్ గ్యాంగ్‌కి, వసీం అక్రమ్‌కి గత కొన్ని రోజులుగా విభేదాలు పొడచూపుతున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం నాడు వసీం అక్రమ్ ఇంటి నుంచి బైక్‌పై బయటకు వచ్చాడు. అప్పటికే కారులో వచ్చి మాటువేసిన కొందరు దుండగులు.. ఇంటి బయటే వసీం అక్రమ్‌పై కత్తులతో విరుచుకుపడ్డారు. ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా కత్తులతో నరికేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వసీం అక్రమ్.. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఘటనాస్థలానికి చేరుకున్నారు. వసీం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఇంతియాజ్ గ్యాంగ్ కోసం గాలింపు చేపట్టారు.
Also read:
Astrology: షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే నష్టపోయే ప్రమాదముంది..!