Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..

JEE Advanced 2021: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) ఖరగ్‌పూర్ సెప్టెంబర్ 11వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..
Jee
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 11, 2021 | 6:32 AM

JEE Advanced 2021: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) ఖరగ్‌పూర్ సెప్టెంబర్ 11వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్ష కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లో చెక్ చేసుకోవచ్చు. ఐఐటీ జేఈఈ పరీక్ష కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీగా సెప్టెంబర్ 16 ను నిర్ణయించారు. నమోదు చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ వరకు దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయవచ్చు. అభ్యర్థుల అడ్మిట్ కార్డు సెప్టెంబర్ 25 న అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ వరకు అందుబాటులో ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3 న నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు షిఫ్ట్‌లలో జరుపుతారు. మొదటి షిఫ్ట్ లో పేపర్ I ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండవ షిఫ్ట్‌లో పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్.. 1. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 11, 2. రిజిస్ట్రేషన్ చివరి తేదీ – సెప్టెంబర్ 16, 3. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ – సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు, 4. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష – అక్టోబర్ 3వ తేదీన, 5. అక్టోబర్ 10వ తేదీన తాత్కాలిక సమాధాన కీ ని ఆన్‌లైన్‌లో పెడతారు. 6. అక్టోబర్ 10 నుంచి 11 వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి తాత్కాలిక సమాధాన కీలపై అభిప్రాయాలు సేకరిస్తారు. 7. అక్టోబర్ 15వ తేదీన తుది ఆన్సర్ కీ, రిజల్ట్స్‌ని ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడిస్తారు. 8. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ – అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 16 వరకు ఉంటుంది. 9. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) – అక్టోబర్ 18న నిర్వహిస్తారు. 10. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫలితాల ప్రకటన – అక్టోబర్ 22 11. సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం – అక్టోబర్ 16

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.. 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in కి వెళ్లండి. 2: తర్వాత వెబ్‌సైట్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ లింక్‌పై క్లిక్ చేయండి. 3: ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. 4: దీని తర్వాత, మీ పేరు, తండ్రి పేరు, మొబైల్, ఇమెయిల్, ఇతర సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోండి. 5: ఇప్పుడు లాగిన్ చేసి మీ దరఖాస్తు ఫారమ్‌ను నింపండి, ఫోటోను అప్‌లోడ్ చేసి సంతకం చేయండి. 6: ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు సమర్పించండి. 7: ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత సబ్మిట్ కొట్టి.. అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.

Also read:

Astrology: షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే నష్టపోయే ప్రమాదముంది..!

Railway Jobs: పది పాసయితే చాలు.. రైల్వేలో కొలువు కొట్టొచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..

Sai Dharam Tej : మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డుప్రమాదం.. కొనసాగుతున్న చికిత్స ..