AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే నష్టపోయే ప్రమాదముంది..!

Astrology: సనాతన సంప్రదాయంలో ప్రతి రోజు దాని స్వంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇలా వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవత లేదా గ్రహానికి సంబంధించినదిగా భావిస్తుంటాం.

Astrology: షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే నష్టపోయే ప్రమాదముంది..!
ShoppingImage Credit source: Pixabay
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: May 17, 2024 | 11:36 AM

Share

Astrology: సనాతన సంప్రదాయంలో ప్రతి రోజు దాని స్వంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇలా వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవత లేదా గ్రహానికి సంబంధించినదిగా భావిస్తుంటాం. ఆయా రోజుల్లో ఒక నిర్దిష్ట గ్రహం లేదా దేవతను పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారనే విశ్వాసం అనాది కాలంగా వస్తోంది. దానికి సంబంధించిన రోజున సాధన-పూజా క్రతువులు కూడా జరుపుతున్నారు జనాలు. అయితే, వివిధ వస్తువుల కొనుగోలుకు కూడా రోజులు నిర్ణయించడం జరిగింది. అంటే, మీరు ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే.. నిర్ణయించిన రోజున ఆ వస్తువును కొనుగోలు చేస్తే, గరిష్ట ప్రయోజనాన్ని పొందగలుగుతారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అయితే, నిర్ణయించిన రోజున సంబంధిత వస్తువును కొనుగోలు చేస్తే, మీ ఇంటికి తీసుకువస్తే ఆ అంశంతో సంబంధం ఉన్న ప్రయోజనాన్ని మీరు పొందుతారు. ఒకవేళ అలా కాకపోతే అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. మీరు కొన్న వస్తువులు తరచుగా చెడిపోతున్నాయని, కొన్నిసార్లు అపహరణకు గురవుతున్నాయంటే.. ఈ కారణంగానే అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇలాంటి లోపాలను నివారించడానికి మీరు రోజువారీ ప్రాతిపదికన షాపింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఏ రోజు ఏ వస్తువును కొనుగోలు చేయాలో.. ఏది శుభకరం, ఏది అశుభం అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదివారం.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం సూర్యదేవుడికి అంకితం చేయబడింది. వాహనాలు, ఆయుధాలు, గోధుమలు, ఎర్ర వస్తువులు, పర్సులు, కత్తెరలు, జంతువులు మొదలైనవి కొనుగోలు చేయడానికి ఆదివారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కొత్త దుస్తులు ధరించాలనుకుంటే ఈ రోజున ధరించవచ్చు.

మంగళవారం.. భూమిపుత్ర మంగళదేవుడిని మంగళవారం పూజిస్తారు. మంగళవారం నాడు భూమి, భవనం మొదలైనవి కొనడం శ్రేయస్కరం. భూమిని తవ్వే పని మంగళవారం చేయొద్దు. ఈ రోజు పాలు, కలప, తోలు, మద్యం మొదలైన వాటితో తయారు చేసిన వస్తువులను కొనకూడదు. మంగళవారం నాడు మర్చిపోయి కూడా ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు. కానీ, ఎవరికైనా అప్పు ఉన్నట్లయితే.. ఈ రోజున తిరిగి ఇచ్చేయాలి.

బుధవారం.. బుధవారం బుదుడికి గుర్తుగా భావిస్తారు. బుధవారం నిర్మాణ పనులు, బ్యాంకుకు సంబంధించిన పని, కొత్త బట్టలు ధరించడం, ఒకరి నుండి డబ్బు తీసుకోవడం మొదలైనవి చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

గురువారం.. గురువారం విష్ణువు, బృహస్పతికి అంకితం చేయబడింది. దాదాపు అన్ని పనులకు ఈ రోజు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు చేసే పని ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. గురువారం విద్యా పని చేయడం వలన అపారమైన విజయం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున చేసే మతపరమైన ఆచారాలు, ప్రయాణాలు కూడా విజయవంతం అవవుతాయి.

శుక్రవారం.. దాదాపు అన్ని పనులకు శుక్రవారం కూడా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏదైనా కొత్త విషయం ప్రారంభించడం మొదలు.. కొత్త బట్టలు ధరించడం వరకు ఈ రోజు ఉత్తమమైనదిగా పేర్కొనడనం జరిగింది. కళ, సంగీతం, అందం మొదలైన వాటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడానికి శుక్రవారం పవిత్రమైనది.

శనివారం.. శనిదేవుడు శనివారానికి అధిపతి. ఈ రోజు కోర్టు సంబంధిత విషయాలలో విజయం కోసం, వాహనాన్ని కొనుగోలు చేయడానికి, యంత్ర సంబంధిత వస్తువులను కొనడానికి మొదలైన వాటికి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. అయితే, శనివారం ఇనుము, తోలు, ఉప్పు, నూనె, పెట్రోలు మొదలైనవి కొనడం మానుకోవాలి.

Also read:

Railway Jobs: పది పాసయితే చాలు.. రైల్వేలో కొలువు కొట్టొచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..

Sai Dharam Tej : మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డుప్రమాదం.. కొనసాగుతున్న చికిత్స ..

Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్‌.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!