“అన్నయ్య’ అని పిలిపించుకుంటూనే..దారుణం

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఓ వైపు ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నప్పటికీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చెల్లి అని పిలుస్తూనే బాలికను చెరబట్టాడో కామాంధుడు. రెండు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దంపతులకు ఓ కుమార్తె ఉంది. భర్త ఉపాధి […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 3:45 pm, Wed, 18 December 19
"అన్నయ్య' అని పిలిపించుకుంటూనే..దారుణం
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఓ వైపు ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నప్పటికీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చెల్లి అని పిలుస్తూనే బాలికను చెరబట్టాడో కామాంధుడు. రెండు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన దంపతులకు ఓ కుమార్తె ఉంది. భర్త ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉండటంతో భార్య, కూతురితో కలిసి నివసిస్తోంది. సంతబొమ్మాళి మండలం ఓ పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతోంది. వారికి సమీప బంధువైన ఉప్పాడ సంతోష్ తరుచూ వారింటికి వచ్చేశాడు. బాలికతో చనువుగా ఉంటున్నా.. అన్న వరుసే కదా అని ఆమె తల్లి అంతగా పట్టించుకోలేదు. దీన్ని ఆసరాగా తీసుకున్న సంతోష్ బాలికను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో సెల్‌ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీసి వాటితో బెదిరించేవాడు. రెండు నెలలుగా అఘాయిత్యం చేస్తూ వచ్చిన సంతోష్ బాలికను పదేపదే కోరిక తీర్చమని బలవంతం పెట్టేవాడు. లేకుంటే ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరించేవాడు. గతవారం రోజులుగా కోరిక తీర్చాలంటూ వేధిస్తుండటంతో బాలిక నిరాకరిస్తూ వచ్చింది. దీంతో సంతోష్ విదేశాల్లో ఉన్న బాలిక తండ్రికి ఈ నెల 12వ తేదీన అసభ్య వీడియోలు, ఫోటోలు వాట్సాప్ ద్వారా పంపించాడు దీంతో బాలిక తండ్రి భార్యకు ఫోనులో సమాచారం అందించడంతో జరిగిన ఘోరం బయటపడింది.
బాలికను తల్లి గట్టిగా నిలదీయడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో సంతోష్ అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. దీంతో బాలిక తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద 376 (3), 506, ఐటీ యాక్ట్‌ చట్టం కింద 67(బి), ఎ, బీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు.
మరోవైపు టెక్కలి మండలం రావివలసలో మైనర్‌ బాలికపై ఓ యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులు తాళలేక ఆ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకే రోజు ఈ రెండు ఘటనలు వెలుగులోకి రావటంతో జిల్లా వాసులు ఆందోళవ్యక్తం చేస్తున్నారు. దిశ సంఘటన మరువక ముందే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవటంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.