తొమ్మిది నెలల గర్భిణీపై అత్యాచారం..

తొమ్మిది నెలల గర్భిణీపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా ఆ దారుణాన్నంతా తన సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. విషయం బయటకు చెబితే వీడియో బయటపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బొమ్మకల్‌ గ్రామంలో నివసిస్తున్న ఓ జంటపై స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌ కన్నుపడింది. సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త డ్యూటీకి వెళ్లటం గమనించిన కేబుల్‌ ఆపరేటర్‌ రామకృష్ణ..టీవీ రిపేయిర్‌ పేరిట ఇంటికి […]

తొమ్మిది నెలల గర్భిణీపై అత్యాచారం..
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 18, 2019 | 2:49 PM

తొమ్మిది నెలల గర్భిణీపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా ఆ దారుణాన్నంతా తన సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. విషయం బయటకు చెబితే వీడియో బయటపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బొమ్మకల్‌ గ్రామంలో నివసిస్తున్న ఓ జంటపై స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌ కన్నుపడింది. సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త డ్యూటీకి వెళ్లటం గమనించిన కేబుల్‌ ఆపరేటర్‌ రామకృష్ణ..టీవీ రిపేయిర్‌ పేరిట ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరు లేకపోవటంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని, వీడియో బయటపెడతానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె ఎవరికీ చెప్పకుండా తనలో తానే బాధపడుతూ ఉండిపోయింది. సాయంత్రానికి ఇంటికి వచ్చిన భర్త..తన పరిస్థితిని చూసి గట్టిగా నిలదీయగా విషయం చెప్పింది. మొదట పరువు పోతుందని భావించిన బాధితులు..ఆలస్యంగానైనా పోలీసులను ఆశ్రయించారు. కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు నిందితుడు రామృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన రామకృష్ణను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.