చిత్తూరు జిల్లాలో దారుణం.. ఏనుగుల దాడిలో కాపలాదారుడి మృతి.. తొండంతో విసిరేసి మరీ చంపాయి..
Elephant Attack in Chittoor : చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుత్తూరులోని కళ్యాణపురం ఎస్టీ కాలనీ లో ఓ మామిడితోట
Elephant Attack in Chittoor : చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుత్తూరులోని కళ్యాణపురం ఎస్టీ కాలనీ లో ఓ మామిడితోట కాపాలదారుడిపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేసాయి.. దీంతో స్థానికులు భయ బ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరులోని కళ్యాణపురం ఎస్టీ కాలనీలో గత కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. నిన్న అర్దరాత్రి మామిడితోటలో కాపాలా ఉన్న చిన్నబ్బ అనే వ్యక్తిపై దాడి చేసాయి.
ఏనుగులు వస్తున్నాయని టపాసులు కాల్చడంతో చిన్నబ్బ ను తొండంతో విసిరేసి చంపాయి. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. చీకట్లో పక్కనే ఉన్న ఏనుగుల గుంపును గమనించ లేకపోయిన చిన్నబ్బ ఏనుగుల దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటనతో కాలనీలో విషాదం నెలకొంది. అటవీ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల ఏనుగుల దాడిలో చాలామంది మృత్యవాత పడుతున్నారు. అడవుల్లో ఠీవిగా తిరగాల్సిన గజరాజులు.. సమీప గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. అన్నదాతల ఉసురు తీస్తున్నాయి. గుంపుల నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగులు విధ్వంసాలకు పాల్పడుతున్నాయి. దాడుల్లో పాడి పశువులూ అసువులు బాస్తున్నాయి.. పంటలూ దెబ్బతింటున్నాయి.
ఇప్పటి వరకు ఏనుగు దాడిలో కురుపాం నియోజకవర్గంలో ఆరుగురు మృతి చెందారు. అటవీశాఖ అధికారులు రాత్రి పగలు కష్టపడటమే తప్ప పూర్తిగా ఎనుగులను తరలించలేని పరిస్థితి. గజరాజుల వల్ల పండిన పంట తెచ్చుకోలేకపోతున్నామంటున్నారు ప్రజలు. 20 రోజులుగా ఇదే భయంతో ఉన్నారు. ఇంత జరిగినా అధికారులు ఏనుగుల తరలించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. తమ ప్రాణాలకు భరోసా ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.