Covid Vaccine: వ్యాక్సీన్ తీసుకున్నా వదలని కరోనా మహమ్మారి.. ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ సర్జన్..
Covid Vaccine: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్ కూడా అడ్డుకోలేకపోతోందని తేలిపోయింది. ఇప్పటికే రెండు డోస్‌ల వ్యాక్సి్న్ తీసుకున్న వారు కూడా..
Covid Vaccine: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్ కూడా అడ్డుకోలేకపోతోందని తేలిపోయింది. ఇప్పటికే రెండు డోస్‌ల వ్యాక్సి్న్ తీసుకున్న వారు కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ రావత్(58) కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. ఢిల్లీలోని సరోజ్ ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో సర్జన్‌గా డాక్టర్ రావత్ విధులు నిర్వహిస్తు్న్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలెటర్‌పై పెట్టి చికిత్స అందించారు. అప్పటికే ఊపరితితుల్లో ఇన్‌ఫెక్షన్ ఎక్కువ అవడంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడింది. దాంతో అప్పటి వరకు హోంఐసోలేషన్‌లో ఉన్న ఆయను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఊపిరితిత్తులను మార్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్ర ఇన్‌ఫెక్షన్ బారిన పడిన డాక్టర్ అనిల్ కుమార్ రావత్.. ప్రాణాలు కోల్పోయారు.
డాక్టర్ రావత్.. 1996లో సరోజ్ ఆస్పత్రి ప్రారంభమైనప్పటి నుంచి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. మార్చి ప్రారంభంలోనే ఆయన కోవిషీల్డ్ వ్యాక్సీన్ రెండో డోస్ కూడా తీసుకున్నారు. కరోనా సోకిన తరువాత.. డాక్టర్ రావత్ తాను వ్యాక్సిన్ తీసుకున్నాననే ధీమాతోనే ఉన్నారు. తన సహోద్యోగులతో కూడా అదే మాట చెప్పారు. ‘కరోనాను తాను జయిస్తాను, కరోనా వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్నాను’ అని రావత్ తమతో అన్నట్లు ఆయన సహోద్యోగులు తెలిపారు. కానీ ఇలా రావత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని వారు వాపోయారు.
Also read:
Corona Effect: హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి బయలుదేరిన కర్నూలు పోలీసులు.. మరికాసేపట్లో..