AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్ నివారణకు గో మూత్రం తాగాలని సూచిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే..! తాను పరగడుపున అదే చేస్తానని వీడియో..

BJP MLA Surendra Singh : కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే

కొవిడ్ నివారణకు గో మూత్రం తాగాలని సూచిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే..! తాను పరగడుపున అదే చేస్తానని వీడియో..
Bjp Mla Surendra Singh
uppula Raju
|

Updated on: May 09, 2021 | 9:00 AM

Share

BJP MLA Surendra Singh : కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే సరికొత్త విధానంతో ముందుకు వచ్చారు. గో మూత్రంతో కరోనాను నయం చేయవచ్చని చెబుతున్నారు. అయితే కొంతమంది సామన్య ప్రజలే కాకుండా పలువురు రాజకీయ నేతలు కూడా ఇతడికి బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బైరియాకు చెందిన సురేంద్ర సింగ్ అనే బిజెపి ఎమ్మెల్యే వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఆవు మూత్రాన్ని ఎలా తాగాలో చూపిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇందులో అతడు ఈ విధంగా చెప్పాడు. “నేను ప్రతి ఉదయం బ్రష్ చేసిన తర్వాత ఖాళీ కడుపుతో చల్లటి గో మూత్రాన్ని ఐదు కప్పులు తాగుతాను” అని వీడియోలో పేర్కొన్నాడు. మీరు పరగడుపున ఏమీ తినకుండా మాత్రమే ఇలా చేయాలని తెలిపాడు. అంతేకాదు ఆవు మూత్రం కరోనాతో పోరడడమే కాకుండా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుందని చెప్పాడు. వాస్తవానికి ఈ విషయాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఆదిత్య బిద్వాయ్ అనే జర్నలిస్ట్ షేర్ చేశాడు.

అప్పటి నుంచి ఇది ట్విట్టర్‌లోనే కాదు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు వీడియోను వారి స్పందనను తెలుపుతున్నారు. కామెంట్లు, షేర్స్ చేస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ వాదనలను ఖండించినప్పటికీ దీనిని గట్టిగా విశ్వసించే వ్యక్తులు ఉన్నారు. గత ఏడాది మార్చిలో కొవిడ్‌ను నివారించడానికి హిందూ మహాసభ ఒక ‘గోమూత్ర పార్టీ’ని కూడా నిర్వహించింది.

మరోసారి తెరపైకి హనుమంతుడి జన్మస్థలం వివాదం.. హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీటీడీ..

Putta Madhu: పుట్టామధును విచారిస్తున్న పోలీసులు.. కీలక విషయాలను రాబడుతున్న టాస్క్ఫోర్స్ పోలీసులు