Murder: అన్నను కర్రతో కొట్టి చంపిన తమ్ముడు.. అడ్డొచ్చిన తండ్రికి గాయాలు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ తగాదా ఒకరిని బలిగొంది. తమ్ముడు కర్రతో దాడి చేయగా.. అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Murder: అన్నను కర్రతో కొట్టి చంపిన తమ్ముడు.. అడ్డొచ్చిన తండ్రికి గాయాలు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
murder

Man kills brother: మనుషుల మధ్య బంధాలన్ని ఆర్థిక బంధాలుగానే మారుతున్నాయి. అవసరమైతే  రక్తసంబంధీలకులనే కడతేర్చుతున్నారు. తాజాగా అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ తగాదా ఒకరిని బలిగొంది. తమ్ముడు కర్రతో దాడి చేయగా.. అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన హన్మాండ్లుకు ఇద్దరు భార్యలు. వారిలో ఒక కుమారుడు జుట్టు శ్రీను (35), మరో భార్య కుమారుడు నరేందర్‌ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు.

ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి జుట్టు శ్రీను ఈ నెల 4వ తేదీన స్వగ్రామానికి వచ్చాడు. కొన్నేండ్లుగా వ్యవసాయ భూమి విషయంలో తమ్ముడు నరేందర్‌తో శ్రీనుకు గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ నెల 7వ తేదీన రాత్రి ఇంటికి వచ్చిన తమ్ముడు నరేందర్‌తో శ్రీను గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఇంతలో నరేందర్ అక్కడే ఉన్న కర్రతో అన్న శ్రీనుపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన తండ్రిపై కూడా కర్రతో దాడి చేయగా అతనికి గాయాలయ్యాయి. తనకు ప్రాణాపాయం ఉన్నదని భావించిన నరేందర్‌ తన సోదరుడు శ్రీను చేతిలో నుంచి కర్రను లాక్కొని గట్టిగా తలపై దాడి చేశాడు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బోధన్‌ రూరల్‌.. గ్రామానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also….  Kabul Blast: కాబుల్‌లో మరోసారి బాంబుల మోత​.. పాఠశాల సమీపంలో పేలుడు.. 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు