AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kabul Blast: కాబుల్‌లో మరోసారి బాంబుల మోత​.. పాఠశాల సమీపంలో పేలుడు.. 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది0. కాబుల్‌లోని ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Kabul Blast: కాబుల్‌లో మరోసారి బాంబుల మోత​.. పాఠశాల సమీపంలో పేలుడు.. 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Blasts Targeting Afghan School In Kabul
Balaraju Goud
|

Updated on: May 08, 2021 | 9:02 PM

Share

Blasts targeting Afghan school: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది0. కాబుల్‌లోని ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40మంది అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు అఫ్గాన్​ ప్రభుత్వం తెలిపింది. మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్​ నాజరి తెలిపారు.

పేలుడు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని అఫ్గాన్ మంత్రి తారీఖ్​ అరియాన్​ తెలిపారు. అయితే, అంబులెన్సులను అడ్డుకుని ప్రజలు దాడులకు తెగబడ్డారని దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్​ నాజరి అన్నారు. వారిని సముదాయించి అంబులెన్సులు వెళ్లేలా చేశామన్నారు. కాగా, ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇటీవల అదే ప్రాంతంలో షీతేస్​ మైనార్టీలపై దాడి చేసింది తామేనని ఇస్లామిక్​ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాలు తమ దేశానికి పయనమైన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

Read Also… కోవిడ్ రోగి అంత్యక్రియలకు 150 మంది హాజరు, 21 మంది మృతి, ఖండించిన అధికారులు

గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌..
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌..
స్కార్పియోలో వచ్చిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
స్కార్పియోలో వచ్చిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
వాలెంటైన్స్ డే ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ !
వాలెంటైన్స్ డే ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ !
ప్రోటీన్ లేదా ఫైబర్.. బరువు తగ్గడంలో ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది!
ప్రోటీన్ లేదా ఫైబర్.. బరువు తగ్గడంలో ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది!
జాతకం బాగున్నా.. వివాహం ఆలస్యం అవుతుందా.. కారణం ఇదే!
జాతకం బాగున్నా.. వివాహం ఆలస్యం అవుతుందా.. కారణం ఇదే!
ఆరేళ్ల బాలికను వదలని కామాంధులు..!
ఆరేళ్ల బాలికను వదలని కామాంధులు..!
నీకు మంచి ఫ్యూచర్ ఉంది.. ఆ హీరో మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు
నీకు మంచి ఫ్యూచర్ ఉంది.. ఆ హీరో మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు
ప్రభాస్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
ప్రభాస్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..