Pangolin smuggling: మంచిర్యాల జిల్లాలో అలుగును పట్టారు.. కోటిన్నరకు బేరం పెట్టారు.. చివరకు
అలుగు.. పొంగోలిన్ అనే పిలిచి ఈ జీవి గురించి కరోనా వైరస్‌కు ముందు పెద్దగా జనాలకు తెలీదు. తొలుత కరోనా వ్యాప్తికి ఈ జీవే కారణమని ప్రచారం జరిగింది. కాగా ఈ జీవులు ఎవరికీ...
అలుగు.. పొంగోలిన్ అనే పిలిచి ఈ జీవి గురించి కరోనా వైరస్‌కు ముందు పెద్దగా జనాలకు తెలీదు. తొలుత కరోనా వ్యాప్తికి ఈ జీవే కారణమని ప్రచారం జరిగింది. కాగా ఈ జీవులు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టవు. చైనా లాంటి దేశాల్లో దీన్ని ఆహారంగా కూడా తీసకుంటారు. వీటి చర్మంపై ఉండే పొలుసులను చైనా సంప్రదాయ వైద్యంలో వినియోగిస్తారు. వీటిని క్యాన్సర్ నియంత్రించే మెడిసిన్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ జీవుల కోసం ఇప్పుడు వేట కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు.
తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో కాసిపేటలో 8 మంది సభ్యుల ముఠా అలుగును వేటాడి పట్టుకుంది. దాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ జీవిని అమ్మేందుకు మధ్యవర్తి ద్వారా ఏకంగా కోటిన్నరకు బేరం కుదర్చుకున్నట్లు సమాచారం. బెల్లంపల్లి మండలంలోని బుగ్గగుట్ట అడవిలో అలుగును పట్టుకున్నట్టు నిందితులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో అలుగుల అమ్మకాలు చాటుమాటుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టులో సిర్పూర్‌లో ఫారెస్ట్ అధికారులు అలుగును తరలిస్తోన్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాలోను అలుగును పట్టుకొని.. యూట్యూబ్‌లో వీడియో పెట్టి.. రూ.65 లక్షలకు బేరం కుదుర్చుకున్న ముఠాను గత ఏడాది జులైలో అరెస్ట్ చేశారు.
Also Read:
Actress Jayashree Suicide: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ ఫేమ్ జయశ్రీ ఆత్మహత్య.. తీవ్ర ఒత్తిడితో..!
శ్రీకాకుళం జిల్లాలో యువకుడికి చిక్కిన వింత చేప.. దాని పేరు కూడా మత్సకారులకు తెలియదట..!