మూడేళ్లలో 58 దొంగతనాలు.. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు వాలిపోతాడు.. తాజాగా పోలీసులకు ఎలా చిక్కాడంటే..?

అతడో ఘరానా దొంగ. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు రాత్రికి అన్నీ సర్దేస్తాడు. స్క్రూ డ్రైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌, గునపం వంటి సాధారణ వస్తువులతోనే తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటాడు.

మూడేళ్లలో 58 దొంగతనాలు.. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు వాలిపోతాడు.. తాజాగా పోలీసులకు ఎలా చిక్కాడంటే..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 25, 2021 | 8:21 PM

అతడో ఘరానా దొంగ. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు రాత్రికి అన్నీ సర్దేస్తాడు. స్క్రూ డ్రైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌, గునపం వంటి సాధారణ వస్తువులతోనే తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటాడు. ఇలా మూడేళ్లలో 58 దొంగతనాలకు పాల్పడి పోలీసులనే ముప్పతిప్పలు పెట్టాడు. గతేడాది డిసెంబర్‌ నెల 24న విశాఖలోని ఓ వివాహ వేడుకలో జరిగిన చోరీ కేసును తాజాగా చేధించారు పోలీసులు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఈ ఘరానా దొంగను వైజాగ్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

విశాఖ నగరం మధురవాడలోని ఓ చర్చి పాస్టర్‌ ఇంట్లో జరిగిన చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సీసీ కెమెరా విజువల్స్‌ కీలకంగా మారాయి. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడి వేలిముద్రలను సేకరించిన పోలీసులు ఘరానా దొంగను పట్టుకోగలిగారు. నిందితుడు పాతనేరస్తుడు గంగాధర్‌రావుగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడకు చెందిన పాత నేరస్తుడు గంగాధర్‌రావు చిన్నప్పటి నుంచి ఓ అనాథ ఆశ్రమంలో పెరిగాడు. విజయవాడ నుంచి విశాఖకు వచ్చి సిరిపురంలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేశాడు. అది మానేసి విశాఖలో చోరీలు చేయడం మొదలుపెట్టాడని పోలీసులు వివరించారు.

Also Read:

Pangolin smuggling: మంచిర్యాల జిల్లాలో అలుగును పట్టారు.. కోటిన్నరకు బేరం పెట్టారు.. చివరకు

Sasikala Release Date: ఆ రోజే రిలీజ్ అవ్వనున్న శశికళ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌పై వైద్యుల నుంచి రాని క్లారిటీ