Wine shop theft: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో దొంగల హల్‌చల్.. అర్ధరాత్రి వైన్‌షాప్‌లో లూటీ
దొంగలు అప్‌డేట్ అయ్యారు. ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు అని కాకుండా.. తాజాగా మద్యం షాపులను కూడా టార్గెట్ చేస్తున్నారు.
దొంగలు అప్‌డేట్ అయ్యారు. ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు అని కాకుండా.. తాజాగా మద్యం షాపులను కూడా టార్గెట్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపులో దూరిన దొంగలు భారీ చోరీకి పాల్పడ్డాడు. అయితే, దొంగతనం దృశ్యాలన్నీ షాపులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో వైన్ షాపులో ఈ దొంగతనం జరిగింది. అర్ధరాత్రి షాపులో దూరిన దొంగ..దొరికినకాడికి సర్దేసుకున్నాడు. తెల్లారి ఉదయం షాప్ ఓపెన్ చేసి చూసిన యజమాని ఖంగుతిన్నాడు. షాపులో దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులను ఆశ్రయించాడు. సుమారు పదిహేను లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు కంప్లైట్‌లో తెలిపాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో వైన్ షాప్ మేడపై నుండి వచ్చి వెనక డోర్ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు.
Also Read:
తెలంగాణలోని ఆ ఊరంతా వనవాసానికి వెళ్లింది.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!