విషాదం.. పెళ్లై ఆరు నెలలు కాకముందే.. ప్రియుడితో కలిసి ఆత్మహత్య..

దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలోని మయూర్ విహార్‌లో జరిగింది.

విషాదం.. పెళ్లై ఆరు నెలలు కాకముందే.. ప్రియుడితో కలిసి ఆత్మహత్య..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 16, 2020 | 9:53 PM

దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఓ వివాహితతో పాటు మరో యువకుడు పాయిజన్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలు ప్రియాంకగా గుర్తించారు. ఇక మృతుడు నిశాంత్ అని అతడి వయస్సు 20 ఏళ్లను తెలిపారుర. ఇక మృతురాలి వయస్సు 22 ఏళ్లు అని.. ఆరు నెలల క్రితమే వేరే యువకుడితో ప్రియాంకకు వివాహం అయ్యిందని పోలీసులు తెలిపారు. అయితే సోమవారం రాత్రి 7.15 గంటలకు.. ఘజీపూర్‌ పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి మయూర్ విహార్ ఫేజ్‌3లో.. ఓ యువతీ యువకుడు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు.. స్పృహ కోల్పోయిన స్థితిలో ఆ యువతీ యువకుడు కనింపించారు. దీంతో వెంటనే ఇద్దర్నీ సమీప ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసుల నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని పోలీసులు వెల్లడించారు.