పిఠాపురంలో దారుణం.. ఓ వ్యక్తిని మంచానికి కట్టేసి, కొట్టి చంపిన దుండగులు.. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

ఓ వ్యక్తిని మంచానికి కట్టేసి కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. ఆధ్యాత్మక కేంద్రమైన పిఠాపురంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

  • Balaraju Goud
  • Publish Date - 2:10 pm, Mon, 8 February 21
పిఠాపురంలో దారుణం.. ఓ వ్యక్తిని మంచానికి కట్టేసి, కొట్టి చంపిన దుండగులు.. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

Man Murder : తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని మంచానికి కట్టేసి కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. ఆధ్యాత్మక కేంద్రమైన పిఠాపురంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహా సంస్థానం ఎదురుగా ఉండే కోటవారి వీథిలో 46 ఏళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస్‌ను మంచానికి కట్టేసిన దుండగులు దాడి చేశారు. అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇదిలావుంటే, శ్రీనివాస్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మొదటి భార్య మరణించడంతో రెండో వివాహం చేసుకున్న శ్రీనివాస్ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండు భార్యకు ఒకరు ఉన్నారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ భీమారావు పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. హంతకులు అనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారన్న పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు.

Read Also… ఈజీ మనీ కోసం ఆశపడ్డాడు.. లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఏకంగా 1.5 లీటర్ల వోడ్కా తాగాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!