ప్రకాశం జిల్లాలో పురుగు మందు తాగిన మహిళా సర్పంచ్ అభ్యర్థి.. ఒప్పందంలో మెలకే కారణమా..?
నామినేషన్ వేసిన మహిళ అభ్యర్థి చలంచర్ల హైమావతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్పడింది.
Sarpanch candidate suicide attempt : ప్రకాశం జిల్లాలో మహిళా సర్పంచ్ అభ్యర్థి బలవన్మరణానికి యత్నించింది. కురిచేడు మండలం ప్రతిజ్ఞాపురి పంచాయతీకి వైసీపీ మద్దతుదారుగా నామినేషన్ వేసిన మహిళ అభ్యర్థి చలంచర్ల హైమావతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్పడింది. పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీగా నిలబడ్డ టీడీపీ మద్దతుదారులను వైసీపీలో చేర్చుకుని వారితో కలిసి పనిచేయాలని వైసీపీ నేతలు సూచించడంతో హైమావతి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలావుంటే, ప్రతిజ్ఞాపురి పంచాయతీకి వైసీపీ మద్దతుదారుగా చలంచర్ల హైమావతి నామినేషన్ వేశారు. గ్రామంలో వైసీపీ తరుపున హైమావతి ప్రచార కార్యక్రమాలు చేసుకుంటున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన కొందరు టిడిపి పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమక్షంలో వైసిపిలో చేరారు. అయితే, ఇటీవల పార్టీలో చేరిన వారికి మొదటి రెండేళ్ల పాటు సర్పంచ్‌గా.. అనంతరం తనను మూడేళ్లుగా సర్పంచ్‌గా పదవులు చేపట్టాలంటూ పార్టీ నేతలు ఆదేశించారు. దీంతో కన్నీటిపర్యంతమైన హైమావతి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
కాగా, హైమావతి… ప్రస్తుతం ఆమె కురిచేడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తనను కాదని, టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో మనస్థాపానికి గురై పురుగుల మందుతాగానని బాధితురాలుహైమావతి చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి…. పిఠాపురంలో దారుణం.. ఓ వ్యక్తిని మంచానికి కట్టేసి, కొట్టి చంపిన దుండగులు.. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు