Madhira: సిరుల కోసం భార్యతో వైద్యుడి క్షుద్రపూజలు.. చివరికి ఆ పూజారితోనే సంసారం చేయాలంటూ

ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం చెలరేగింది. మధిరలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు తన భార్యతో క్షుద్ర పూజలు చేయించడమే కాకుండా ఆమెను పూజారితో సంసారం చేయాలంటూ వేధింపులకు గురిచేశాడు.

Madhira: సిరుల కోసం భార్యతో వైద్యుడి క్షుద్రపూజలు.. చివరికి ఆ పూజారితోనే సంసారం చేయాలంటూ
Madhira Police Station
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 21, 2022 | 7:22 PM

Khammam District: ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం చెలరేగింది. మధిరలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు(RMP Doctor) తన భార్యతో క్షుద్ర పూజలు చేయించాలని చూడటమే కాకుండా ఆమెను పూజారితో సంసారం చేయాలంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక భార్య ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్‌ బ్రహ్మం..పదేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొద్దిరోజులుగా  ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న బ్రహ్మానికి..  క్షుద్ర పూజలు చేస్తే గ్రహస్థితి బాగుపడి ఇబ్బందులు తొలగిపోతాయని ఓ మిత్రుడు సలహా ఇచ్చాడు. దీంతో సదరు ఆర్‌ఎంపీ.. కృష్ణా జిల్లా(Krishna District) జగ్గయ్యపేట మండలం వజినేపల్లికి చెందిన పూజారిని సంప్రదించాడు. అతడు శనిగ్రహ దోషానికి పూజలు చేయాలని బ్రహ్మానికి సూచించాడు. 45 రోజుల పాటు భార్యతో క్షుద్రపూజలు చేయిస్తే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవంతుడివి అవుతావని నమ్మబలికి పూజా విధానం తెలియజేశాడు.

అతడి మాటలు నమ్మిన ఆర్ఎంపీ వైద్యుడు.. పూజారిని ఇంటికి తీసుకువచ్చి.. భార్య చేత ఇంట్లో క్షుద్ర పూజలు చేయించాలని చూశాడు. ఈ క్రమంలోనే పూజారితో సంసారం చేయమని భార్యపై ఒత్తిడి తెచ్చాడు బ్రహ్మం. దీంతో భర్త వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు ఎలాగోలా ఇంట్లోంచి తప్పించుకుని పుట్టింటికి చేరింది. బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Hyderabad: అమెరికా నుంచి పార్శిల్​లో పరుపు.. ఓపెన్​ చేస్తే అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి

తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు