Telangana: స్కూటీలు, ల్యాప్‌టాప్స్‌‌పై ఆఫర్స్.. అబ్బా భలే ఛాన్స్ అని సమర్పించుకున్నారు.. ఎంత కాజేశాడో తెలుసా..?

ఖమ్మం జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో 65 వేలకే స్కూటీ ఇస్తానని నమ్మబలికాడు ఓ వ్యక్తి. సుమారు కోటి యాబై లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు.

Telangana: స్కూటీలు, ల్యాప్‌టాప్స్‌‌పై ఆఫర్స్.. అబ్బా భలే ఛాన్స్ అని సమర్పించుకున్నారు.. ఎంత కాజేశాడో తెలుసా..?
Tekangana Crime
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 21, 2022 | 7:47 PM

Khammam District: ఖమ్మం జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో 65 వేలకే స్కూటీ ఇస్తానని నమ్మబలికాడు ఓ వ్యక్తి. సుమారు కోటి యాబై లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. అనుకున్న టార్గెట్‌ రీచ్‌ కావటంతో జెండా ఎత్తేశాడు. వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు. అసలు విషయం గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని మధిర(Madhira) చెరుకుమల్లి వారి వీధిలో ఇస్కాన్ అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాడు రాధాకృష్ణ అనే వ్యక్తి. ఆ సంస్థ పేరుతో 65 వేల రూపాయలకే స్కూటీ అని ఆఫర్ పెట్టాడు. ఇస్కాన్‌ పేరు చెప్పగానే జనాలు కూడా నమ్మేశారు. మొదట్లో డబ్బు కట్టిన వెంటనే 10 రోజుల్లోనే స్కూటీలు ఇచ్చేశాడు. దీంతో చాలామంది తెలిసిన వారితోనూ బంధువులతో కూడా డబ్బు కట్టించారు. అదే విధంగా మిక్సీలు, గ్రైండర్లు, ల్యాప్ టాప్ లు, కుట్టు మిషన్ ల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. అలా సుమారు కోటి యాభై లక్షలు కలెక్ట్ చేశాడు. ఫోన్‌పే, గూగుల్‌ పే వద్దన్నాడు. ఇక్కడ అంతా క్యాష్‌ అని చెప్పాడు. దీంతో డబ్బులు ఎగబడి కట్టారు జనం.  కేవలం తెలంగాణ నుండే కాకుండా ఏపీలోని కృష్ణా జిల్లా, విశాఖ జిల్లాల నుంచి కూడా వచ్చి కేటుగాడికి డబ్బు సమర్పించుకున్నారు.

అలా అందరి డబ్బు వసూలు చేసిన రాధాకృష్ణ ఫోన్‌ స్విచ్చాఫ్ పెట్టుకోవటంతో అనుమానం వచ్చిన బాధితులు అతని ఇంటికి వెళ్లారు. ఎవరూ లేకపోవటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు 150 మందికి పైగా బాధితులు అతనికి డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read: Hyderabad: అమెరికా నుంచి పార్శిల్​లో పరుపు.. ఓపెన్​ చేస్తే అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి

తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు