Hyderabad: అమెరికా నుంచి పార్శిల్​లో పరుపు.. ఓపెన్​ చేస్తే అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి

అమెరికా నుంచి ఓ కొరియర్​ సంస్థకు వచ్చిన పార్శిల్​ను చెక్ చేసిన ఎన్సీబీ అధికారులు నిందితులను అరెస్టు చేశారు. ఈ తరహాలో కూడా క్రైమ్ జరుగుతుందని తెలిసి షాక్‌కు గురయ్యారు.

Hyderabad:  అమెరికా నుంచి పార్శిల్​లో పరుపు.. ఓపెన్​ చేస్తే అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి
Hyderabad Ncb
Follow us

|

Updated on: Feb 21, 2022 | 6:19 PM

ఎంత కఠిన శిక్షలు వేస్తున్నా అక్రమార్కులు మాట వినడం లేదు. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు. అవును.. గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు పెట్రేగిపోతున్నాయి.  పోలీసుల కళ్లు గప్పి గంజాయిని తరలించేందుకు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు స్మగ్లర్స్.  తప్పించుకునేందుకు గంజాయి స్మగ్లర్లు అనుసరిస్తున్న మార్గాలు పోలీసులకే విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు ఆహార పదార్థాల మాటున.. పాల వ్యాన్లు లోపల…  బోర్‌వెల్ లారీలో ఇంకా పలు రకాలుగా గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన స్మగ్లర్లు.. పోలీసులకు చిక్కారు. తాజాగా ఇందులో ఊహించని కోణం వెలుగుచూసింది.  అమెరికా నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను‌ చెక్ చేసిన హైదరాబాద్‌ ఎన్సీబీ అధికారులు కంగుతిన్నారు. అందులో గంజాయి ప్యాకెట్లు ఉండటంతో షాక్ తిన్నారు. ఆ పార్శిల్​ను దిగుమతి చేసుకున్న ఇద్దరు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఓ కొరియర్ సంస్థకు దిగుమతైన పరుపులో గంజాయి కవర్లను అధికారులు గుర్తించారు. అది కూడా నార్మల్ గంజాయి కాదు..  1.42 కిలోల హైగ్రేడ్ గంజాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు గతంలో కూడా పలు రకాల మత్తు పదార్థాలను.. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని అధికారులు విచారణలో కనుగొన్నారు.

ఇలా దిగుమతి చేసుకున్న మాదకద్రవ్యాలను వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారని ఎంక్వైరీలో తేలింది. కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా మత్తు దందా కొనసాగుతోందన్న అధికారులు.. డార్క్ నెట్ ద్వారా గంజాయిని ఆర్డర్ చేస్తున్నారని వెల్లడించారు.

Also Read: Andhra Pradesh: జగనన్న తోడు కార్యక్రమం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!

తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు