Minister Goutham Reddy Death: మంత్రి మేకపాటిపై సోషల్ మీడియాలో వస్తున్నవి అవాస్తవం.. ‘అసలు ఏం జరిగిందంటే..’

తెలుగు రాష్ట్రాలు ఇవాళ షాకింగ్‌ న్యూస్‌తో నిద్ర లేచాయి. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి గుండెపోటుతో మరణించాన్న వార్త… పొద్దుపొద్దున్నే అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఉదయం ఏడు గంటలకు గుండెనొప్పితో సోఫాలో కుప్పకూలిన గౌతమ్‌ రెడ్డిని..

Minister Goutham Reddy Death: మంత్రి మేకపాటిపై సోషల్ మీడియాలో వస్తున్నవి అవాస్తవం.. 'అసలు ఏం జరిగిందంటే..'
Minister Goutham Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 21, 2022 | 5:55 PM

తెలుగు రాష్ట్రాలు ఇవాళ షాకింగ్‌ న్యూస్‌తో నిద్ర లేచాయి. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి(Minister Goutham Reddy)  గుండెపోటుతో మరణించాన్న వార్త… పొద్దుపొద్దున్నే అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఉదయం ఏడు గంటలకు గుండెనొప్పితో(Heart Attack) సోఫాలో కుప్పకూలిన గౌతమ్‌ రెడ్డిని.. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు.. అయితే ఆయన అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు తేల్చారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై స్పందించింది మంత్రి మేకపాటి కుటుంబం. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం అని అన్నారు. రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా ఇంటికి చేరిన్నారని వెల్లడించారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలను మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు మీడియాకు అందించారు.

  1. 06.00 గం.లకి రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్న మంత్రి
  2. 06:30 గం.ల వరకూ మంత్రిగారు ఫోన్ లతో కాలక్షేపం
  3. 07.00 గం.లకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి
  4. 07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన మంత్రి గౌతమ్ రెడ్డి
  5. 07:15గం.లకు హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి
  6. 7:16 గం.లకు కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి
  7. 07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు
  8. 07:20 గం.లకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం
  9. 07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో.. మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన భార్య శ్రీకీర్తి
  10. 07:22 “నొప్పి పెడుతుంది కీర్తి” అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరిన మంత్రి సిబ్బంది
  11. 07:27 మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్,సిబ్బంది
  12. 08:15 గం.లకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు
  13. 09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు
  14. 09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన అపోలో వైద్యులు

ఇవి కూడా చదవండి: UP Elections 2022: మూడో రౌండ్ పోలింగ్‌పై యూపీ రాజకీయ పక్షాల్లో గుబులు.. బుందేల్‌ఖండ్‌లో కమలం మరోసారి వికసించేనా?

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..