AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు

AP Minister Goutham Reddy Passes Away: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు.. సోమవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
Mekapati Goutham Reddy Passes Away Live Updates Video
Sanjay Kasula
|

Updated on: Feb 21, 2022 | 10:04 PM

Share

AP Minister Goutham Reddy Passes Away: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు.. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హైదరాబాద్‌(Hyderabad) అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గౌతమ్‌రెడ్డి(Goutham Reddy)ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్‌ పర్యటన ముగించుకొని.. నిన్ననే హైదరాబాద్‌ తిరిగి వచ్చారు గౌతమ్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్‌రెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలుపొందారు. ఆయన ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

గౌతమ్ రెడ్డి మరణ వార్త విన్న అభిమానులు, వివిధ పార్టీల నాయకులు అపోలో ఆసుపత్రికి తరలివస్తున్నారు. ప్రస్తుతం మేకపాటి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే గౌతమ్ రెడ్డి ఇలా ఉన్నట్టుండి చనిపోవడం అందరికీ షాకింగా మారింది. గౌతమ్ రెడ్డి ఎంతో ఆరోగ్యంగా ఉంటారనీ. కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారనీ. హోటల్లో కూడా జిమ్ ఫెసిలిటీ చూసుకుంటారనీ చెబుతుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. జిల్లాలో ఎక్కడా ఎవరితోనూ వివాదాల్లేకుండా ఉంటారనీ. ఆయనెంతో మృధుస్వభావిగా చెబుతున్నారు ఆయన బంధు మిత్రులు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి కనీసం కోపతాపాలు ప్రదర్శించని వ్యక్తిగా పేరుందని చెప్పుకొస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలన్న ధోరణిలో ఎక్కడా తేడా చూపేవారు కాదనీ. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరితోనూ అంతగా కలిసిపోతారనీ అంటున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Feb 2022 08:48 PM (IST)

    అంత్యక్రియల నిర్వహించే స్థలం మార్పు..

    మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు చోటు చేసుకుంది. ఎల్లుండి ఉదయం ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. రేపు ఉదయం నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలిస్తారు. ఉదయం పదిగంటలకు 15 నిమిషాలకు నెల్లూరు పరేడ్‌ గ్రౌండ్స్‌కు భౌతిక కాయం చేరుకుంటుంది. ఆతర్వాత పది గంటల 45 నిమిషాలకు బైపాస్‌రోడ్‌లోని ఆయన గౌతమ్‌రెడ్డి నివాసానికి తరలిస్తారు. రేపు రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు అమెరికా నుంచి తిరిగి వస్తారు. ఎల్లుండి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.ఈ అంత్యక్రియలకు సీఎం జగన్‌తో పాటు మంత్రి వర్గ సహచరులు, వైసీపీ నేతలు హాజరవుతారు.

  • 21 Feb 2022 08:38 PM (IST)

    ముఖ్యమంత్రి కార్యాలయంపై జాతీయ జెండా అవనతం

    ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి  హఠాన్మరణానికి సంతాప సూచకంగా అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంపై జాతీయ జెండాను అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం)  చేశారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ భవనంపై కూడా జాతీయ జెండాను అవనతం చేశారు.

  • 21 Feb 2022 08:06 PM (IST)

    గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి నివాళులు

    మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

  • 21 Feb 2022 06:21 PM (IST)

    పరిశ్రమల మంత్రి మేకపాటికి ఎమ్మెల్యే రోజా నివాళులు

    పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్యే విడదల రజిని నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

  • 21 Feb 2022 04:52 PM (IST)

    గౌతమ్‌రెడ్డి అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నా- ప్రభుత్వ సలహాదారు సజ్జల

    గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అకాల మరణం ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని అన్నారు.  మంగళవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని నెల్లూరుకు తరలిస్తామన్నారు. ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  హాజరవుతారని తెలిపారు.

  • 21 Feb 2022 04:17 PM (IST)

    సొంత అన్నను కోల్పోయినట్లు ఉంది.. -మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

    పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందన్నారు. ఆయనకి వివాదాలు లేవన్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో కొద్దీ రోజుల క్రితం పలు సమస్యలు గురించి చర్చించామని అన్నారు. ఆయన అకాల మరణం పార్టికి, నెల్లూరు జిల్లాకు తీరని లోటు అని అన్నారు. మంగళవారం నెల్లూరులో పార్టీ నాయకులు చివరి చూపు చూడటానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

  • 21 Feb 2022 04:08 PM (IST)

    గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి సినీ నటుడు మోహన్‌బాబు నివాళులు

    పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి సినీ నటుడు మోహన్‌బాబు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

  • 21 Feb 2022 04:05 PM (IST)

    విలువలతో కూడిన రాజకీయం కోసం గౌతమ్‌ వచ్చారు.. – పవన్ కళ్యాణ్

    గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదేళ్ల మనోర్‌ నివాళులు అర్పించారు. విలువలతో కూడిన రాజకీయం కోసం మేకపాటి గౌతమ్‌రెడ్డి వచ్చారు.. అలానే రాజకీయాల్లో పని చేసారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ మంచి వ్యక్తిని కోల్పోయాని.. హుందాగా రాజకీయాల్లో ఎలా ఉండాలో గౌతమ్‌ చూపించారని అన్నారు. నెల్లూరు జిల్లా వాసిగా నాకు మేకపాటి కుటుంబం బాగా తెలుసన్నారు. వ్యాపారంలో సంపాదించి ప్రజల కోసం వెచ్చించారని ప్రశంసించారు. ఆయనకు సంతాపంగా నా మూవీ ప్రి రీలీజ్ ఈవెంట్ కూడా వాయిదా వేసినట్లుగా గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి లాంటి అరుదైన వ్యక్తి కనుమరుగవడం నిజంగా జీర్ణించుకోలేక పోతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

    Pawan

    Pawan

  • 21 Feb 2022 03:49 PM (IST)

    గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు

    గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదేళ్ల మనోర్‌ నివాళులు అర్పించారు.

  • 21 Feb 2022 03:45 PM (IST)

    బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు

    పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం నెల్లూరు తరలిస్తారు. అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి భారత్‌కు బయల్దేరారు. చెన్నై నుంచి అర్జున్‌రెడ్డి నెల్లూరు చేరుకుంటారు. ప్రభుత్వం లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియాలు బుధవారం జగరనున్నాయి.

    కాగా గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణం  పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. మంగళవారం ఉదయం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయ‌న పార్థివ దేహాన్ని అభిమానులు, నేత‌ల‌ సంద‌ర్శ‌నార్థం ఉంచుతారు. అనంతరం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఎయర్ లిఫ్ట్ ద్వారా తిరుపతి అక్కడి నుంచి  స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు అర్జున్‌ రెడ్డి వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

  • 21 Feb 2022 02:55 PM (IST)

    సౌమ్యుడు, వివాదరహితుడు గౌతమ్‌.. – కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపట్ల ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. సౌమ్యుడు, వివాదరహితుడైన గౌతమ్‌.. ఎన్నోసార్లు ఢిల్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి గురించి తమతో చర్చించారని చెప్పారు. అలాంటి వ్యక్తి అకాలమరణం చెందడం బాధించిందన్నారు. కేంద్రం తరపున, బీజేపీ తరపున.. గౌతమ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • 21 Feb 2022 02:29 PM (IST)

    గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం జగన్‌ పరామర్శ..

    గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించారు. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని సీఎం జగన్‌ ఓదార్చారు.

  • 21 Feb 2022 02:13 PM (IST)

    గౌతమ్ మరణం బాధకరంః జేసీ దివాకర్ రెడ్డి

    గౌతమ్ రెడ్డి మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి జేసీ వివాకర్ రెడ్డి అన్నారు. గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డితో తనకు యాభై ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఇద్దరం ఒకే క్లాస్‌మేట్లమని చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ అనుబంధం కొనసాగుతోందన్నారు. రాజమోహన్ చాలా సౌమ్యుడని, ఆయన కంటే గౌతమ్ రెడ్డి ఇంకా నెమ్మదని, తండ్రికి తగ్గ తనయుడని కొనియాడారు. గౌతమ్ మరణం ఎవరూ ఊహించనిదని, 50 ఏళ్లు కూడా లేని ఆయన మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గౌతమ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు జేసీ దివాకర్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

  • 21 Feb 2022 01:55 PM (IST)

    గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ

    మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, వలభనేని వంశీ నివాళులు అర్పించారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

    11

    11

  • 21 Feb 2022 01:52 PM (IST)

    గౌతమ్‌రెడ్డి ఉన్నత ఆశయాలు, విలువలు కలిగినవ్యక్తిః కేవీపీ

    గౌతమ్‌రెడ్డి మృతి పట్ల కేవీపీ రామచంద్రరావు సంతాపం తెలిపారు. గౌతమ్‌రెడ్డి మరణం చాలా బాధాకరమన్నారు. గౌతమ్‌రెడ్డి ఉన్నత ఆశయాలు, విలువలు కలిగినవారన్నారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాని కేవీపీ అన్నారు.

  • 21 Feb 2022 01:49 PM (IST)

    మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి సంతాపం

    ఆరోగ్యపరంగా, ఫిట్‌నెస్‌పరంగా ఎంతో అలర్ట్‌గా ఉండే గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందడం బాధిస్తోందన్నారు మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి

  • 21 Feb 2022 01:49 PM (IST)

    మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సంతాపం

    గౌతమ్‌రెడ్డి మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి. ప్రకృతి ప్రేమికుడు గౌతమ్‌రెడ్డితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కొండా. మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

  • 21 Feb 2022 01:48 PM (IST)

    ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషిః కోమటిరెడ్డి

    ఐటీ శాఖ మంత్రిగా ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషిచేస్తున్న గౌతమ్‌రెడ్డి.. హఠాత్తుగా మరణించడం బాధిస్తోందన్నారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

  • 21 Feb 2022 01:47 PM (IST)

    ప్రకృతి ప్రేమికుడు గౌతమ్‌రెడ్డిః ఎంపీ సురేశ్‌రెడ్డి

    ప్రకృతి ప్రేమికుడు గౌతమ్‌రెడ్డి మృతిచెందడం దిగ్బ్రాంతికి గురిచేసిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ, మాజీ స్పీకర్ సురేశ్‌ రెడ్డి అన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్‌ ఉన్న నేత.. ఇలా చనిపోవడం కలచి వేస్తోందన్నారు.

  • 21 Feb 2022 01:46 PM (IST)

    యంగ్‌‌స్టర్స్‌ను ఎంకరేజ్‌ చేయడంలో ముందుంటారుః శిల్ప రవి

    రాజకీయాల్లో యంగ్‌ స్టర్స్‌ను ఎంకరేజ్‌ చేయడంలో గౌతమ్‌రెడ్డి ముందుంటారని చెప్పారు ఎమ్మెల్యే శిల్పారవి. ఆయన వల్లే తాను పాలిటిక్స్‌లోకి వచ్చానన్నారు. అలాంటి వ్యక్తి లేరంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు.

  • 21 Feb 2022 01:44 PM (IST)

    చిన్న వయసులో మంత్రిగా తన మార్క్ః పేర్ని నాని

    గౌతమ్ రెడ్డి మృతి పట్ల మంత్రి పేర్నినాని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో షాక్‌కు గురయ్యామన్నారు. తనకు మంచి స్నేహితుడని.. ఆయన మరణం రాష్ట్రానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. చిన్న వయసులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తన మార్క్ చూపించారన్నారు. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నానని.. వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని పేర్ని నాని తెలియజేశారు.

  • 21 Feb 2022 01:42 PM (IST)

    సౌమ్యుడు, నిజాయితీపరుడిని కోల్పోవడం బాధకరంః కిషన్ రెడ్డి

    మేకపాటి మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన తరఫున, పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.చిన్న వయస్సులో నైతిక విలువలతో కూడిన రాజకీయం చేశారన్న కిషన్ రెడ్డి.. గత మూడేళ్లుగా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. సౌమ్యుడు, నిజాయితీపరుడైన గౌతమ్ రెడ్డి అతి చిన్నవయస్సులోనే స్వర్గస్తులు కావడం బాధాకరమని కిషన్ రెడ్డి తెలిపారు.

  • 21 Feb 2022 01:39 PM (IST)

    రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ఎంతో కృషీః అంజాద్ బాషా

    సహచర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయామన్న ఆయన.. గౌతమ్ రెడ్డి మృతిని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. వ్యక్తిగతంగా నాకు సుపరిచితుడని, ఆయన మృతి పార్టీకి, ప్రభుత్వానికి తీరని లోటు అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం మంత్రిగా ఎంతో కృషి చేశారన్నారు.

  • 21 Feb 2022 01:36 PM (IST)

    మోహన్ బాబు సంతాపం

    నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్‌ ఐటి శాఖ మంత్రివర్యులు మేకపాటి గౌతంరెడ్డి గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని సినీ నటులు మోహన్ పేర్కొన్నారు. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నామన్నారు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

  • 21 Feb 2022 01:18 PM (IST)

    మంచి స్నేహితుడిని కోల్పోయానుః కేటీఆర్

    ఉన్నత విద్యావంతుడు.. వివాద రహితుడు.. వారం రోజులు దుబాయ్‌ ఎక్స్‌పోలో ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రి.. ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు మేకపాటి గౌతమ్‌రెడ్డి. ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి మరణం షాక్‌కు గురిచేసిందన్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్‌.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    Ktr

    Ktr

  • 21 Feb 2022 01:12 PM (IST)

    చంద్రబాబు నాయుడు నివాళ్లు

    ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళ్లులర్పించారు.

    10

    10

  • 21 Feb 2022 12:50 PM (IST)

    ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారుః పవన్ కళ్యాణ్

    మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరమన్నారు. విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారని తెలిపారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డికి, కుటుంబ సభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • 21 Feb 2022 12:48 PM (IST)

    విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామాః లోకేష్

    మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి అకాల మరణంతో తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఫిట్‌నెస్‌కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తికి గుండెపోటు రావ‌డం అత్యంత విచార‌క‌రమన్నారు. విదేశాల‌లో ఉన్నత‌ విద్యాభ్యాసం చేసి వ‌చ్చినా విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామా అన్నారు. ఐదుప‌దుల వ‌య‌స్సులోనే హుందా గ‌ల రాజ‌కీయ‌వేత్తగా పేరు గాంచిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మ‌న‌కి దూరం కావ‌డం తీర‌ని విషాదమన్నారు. ఆయన కుటుంబ‌స‌భ్యుల‌కు లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

  • 21 Feb 2022 12:46 PM (IST)

    ఆయన సేవలు చిరస్మరణీయంః అచ్చెన్నాయుడు

    గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్వువు కబళించిందని ఆవేదన చెందారు. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా అందిరితోను ఆప్యాయంగా కలిసిపోయేవారని, హుందాగా ప్రవర్తించేవారని అన్నారు. ‎ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు అచ్చెన్నాయుడు ప్రగాడ సానుభూతి తెలిపారు.

  • 21 Feb 2022 12:44 PM (IST)

    గౌతమ్ రెడ్డి ఫ్యామిలీ ఫోటో..

    తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగు జాడల్లో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు గౌతమ్‌రెడ్డి. 2014లో ఆత్మకూరు నుంచి MLAగా గెలిచి ఫస్ట్‌ టైమ్‌ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో సెకండ్‌ టైమ్‌ MLAగా గెలిచిన గౌతమ్‌రెడ్డి, ఏపీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్‌ మినిస్టర్‌గా… సీఎం జగన్‌ కోర్‌ టీమ్‌లో ఒకరిగా మారారు. గౌతమ్‌రెడ్డి పాలిటిక్స్‌లో ఉంటే, మిగతా ఇద్దరు సోదరులు కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు. తండ్రి రాజమోహన్‌రెడ్డి, సోదరులు విక్రమ్‌రెడ్డి, పృథ్వీరెడ్డితో గౌతమ్‌రెడ్డి ఎప్పుడు కలివిడిగా ఉండేశారు.గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్‌రెడ్డి ఉన్నారు.

    7

    7

  • 21 Feb 2022 12:08 PM (IST)

    ఆయన ఇకలేరన్న మాట వినడానికే చాలా బాధగా ఉందిః బాలకృష్ణ

    మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందని సినీ నటులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన ఇక లేరన్న మాట వినడానికే చాలా బాధగా ఉంది. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబందం లేకుండా అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్దితో పనిచేసేవారు. ‎ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్న బాలకృష్ణ.. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

  • 21 Feb 2022 12:04 PM (IST)

    గౌతమ్‌రెడ్డికి నేనంటే ఎంతో అభిమానంః వెంకయ్య నాయుడు

    గౌతమ్‌రెడ్డి మృతిపట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులని కొనియాడారు. గౌతమ్‌రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉందని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. ‘‘గౌతమ్ రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారు…అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య సానుభూతి తెలియజేశారు.

  • 21 Feb 2022 11:53 AM (IST)

    మేకపాటి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి ప్రగాఢ సానుభూతి

    ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం కలిచి వేసింది. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత చిన్న వయసులో కన్ను ముశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానన్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  • 21 Feb 2022 11:51 AM (IST)

    సన్నిహితుడి మరణం కలిచివేసిందిః హరీశ్‌రావు

    ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడైన మేకపాటి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకపాటి, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడని కొనియాడారు. ఎంతో నిబద్ధత, క్రమశిక్షణతో పని చేసే మేకపాటి, చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని మంత్రి హరీశ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  • 21 Feb 2022 11:48 AM (IST)

    మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రస్థానం

    • 1971 నవంబర్‌ 2న జననం.
    • తల్లిదండ్రులు: మేకపాటి రాజమోహన్‌రెడ్డి- మణిమంజరి
    • గౌతమ్‌ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి.
    • 1994-1997లో ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు.
    • భార్య: మేకపాటి శ్రీకీర్తి
    • పిల్లలు: ఒక కుమార్తె, ఒక కుమారుడు
    • మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు.
    • మొదటిసారి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైఎస్సార్ సీపీ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు.
    • 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి రెండోసారి గెలుపొందారు.
    • ప్రస్తుతం సీఎం వైఎస్‌జగన్‌ కేబినెట్‌లో పరిశ్రమలు,ఐటీశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
  • 21 Feb 2022 11:45 AM (IST)

    హైదరాబాద్‌కు సీఎం జగన్

    మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు రానున్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న సీఎం జగన్‌ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. ప్రత్యక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. నేరుగా గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళర్పించున్నారు. అనంతరం మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరమర్శించనున్నారు.

  • 21 Feb 2022 11:42 AM (IST)

    ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు

    ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.

  • 21 Feb 2022 11:41 AM (IST)

    ఈరోజు రాత్రికి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

    ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

  • 21 Feb 2022 11:40 AM (IST)

    ఆ తండ్రీ కొడుకుల అనుబంధం అంతులేనిది

    కాంగ్రెస్ నేత ప్రస్థానం ప్రారంభించిన రాజమోహనరెడ్డి నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. వైసీపీలో చేరిన ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. అయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న గౌతమ్ రెడ్డి ఆత్మకూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపికై.. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతుననారు. కాగా, రాజమోన్ రెడ్డి-గౌతమ్‌రెడ్డి మధ్య ప్రేమాభిమానాలు అద్వితీయం.. ఎక్కడున్నా తండ్రితో టచ్ లో ఉండేవారు గౌతమ్ రెడ్డి. కొడుకు మృతితో ఆ తండ్రి విలవిలలాడిపోతున్నారు. రాజమోహనరెడ్డిని ఓదార్చడం కష్టతరగా మారింది. కొడుకు మృతితో అగమ్య గోచర స్థికి చేరిన ఆ తండ్రి పరిస్థితి.

    5

    5

  • 21 Feb 2022 11:27 AM (IST)

    దాదాపు 90 నిమిషాల పాటు ఆస్పత్రిలో…

    సోమవారం ఉదయం 7.45 నుంచి దాదాపు 8.55 వరకూ.. అంటే దాదాపు 90 నిమిషాల పాటు ఆస్పత్రిలో CPR జరిగింది. అప్పటికీ బాడీ రెస్పాండ్ కాలేదు. అయినప్పటికీ, ఇక ఆఖరి ప్రయత్నాలు ఫలించకపోవడంతో 9గంటల ప్రాంతంలో ఆయన చనిపోయిటన్లు ధృవీకరించారు.

  • 21 Feb 2022 11:25 AM (IST)

    అసలేం జరిగింది. ఇంట్లో పనిమనుషులు కొమరయ్య, చందు ఇచ్చిన సమాచారం ప్రకారం..

    >> ఉ 7.00 – నిద్రలేచిన గౌతమ్‌ రెడ్డి >> ఉ 7.10- బెడ్‌రూమ్‌ నుంచి బయటకి, సోఫాలో కూర్చున్న గౌతమ్‌రెడ్డి >> ఉ 7.15- కాఫీ ఇచ్చిన వంటమిషని, వద్దన్న గౌతమ్‌ >> ఉ 7.25- చమటలు పడుతున్నాయంటూ గుండెపట్టుకున్న గౌతమ్‌ >> వెంటనే భార్య కీర్తి, కుమార్తె అనన్యకు పనిమనుషుల సమాచారం >> ఉ 7.30- అప్పటికే స్పృహతప్పినట్లు గుర్తించిన కుటుంబీకులు >> కాసేపు సపర్యలు చేసిన కుటుంబీకులు >> ఉ 7.45 – అపోలో ఆస్పత్రిలో చేరిక >> ఉ 9.00 – చనిపోయినట్లు నిర్దారించిన అపోలో వైద్యులు

  • 21 Feb 2022 11:23 AM (IST)

    జీర్ణించుకోలేకపోతున్న నెల్లూరు వాసులు

    మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణాన్ని నెల్లూరు జిల్లావాసులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. గౌతమ్‌రెడ్డి డైలీ గంటపాటు ఎక్సర్‌సైజ్‌ చేసేవారని..ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండేవారని అంటున్నారు. ఆయన ఎక్కడ ఉంటున్నా కూడా జిమ్‌ ఏర్పాటుచేసుకుంటారని..ఆయనకు హార్ట్‌ అటాక్‌ రావడమేంటని నమ్మలేకపోతున్నారు. నెల్లూరులోని ఆయన నివాసానికి వైసీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

  • 21 Feb 2022 11:21 AM (IST)

    ఏపీ అభివృద్ధి కోసం తపించిన మంత్రిః విష్ణువర్దన్‌రెడ్డి

    ఏపీ అభివృద్ధి కోసం తపించిన మంత్రి గౌతమ్‌రెడ్డి అని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు.

  • 21 Feb 2022 11:20 AM (IST)

    ఈ శోకం ఎవరు తీర్చలేనిదిః నారాయణ

    మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీపీఐ నేత నారాయణ. మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాదన్నారాయన.

  • 21 Feb 2022 11:19 AM (IST)

    అత్యంత ఆప్తుడని కోల్పోయాః మంత్రి ధర్మాన కృష్ణదాస్

    గౌతమ్‌ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడని అన్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. అకాల మరణం తనని తీవ్రంగా బాధిస్తోందన్నారు.

  • 21 Feb 2022 11:18 AM (IST)

    గౌతమ్‌రెడ్డి మృతి షాక్‌కు గురి చేసిందిః సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

    నిన్న రాత్రి ఏడున్నరకు నాతో ఉన్న గౌతమ్‌రెడ్డి.. ఉదయం ఏడున్నరకు కన్నుమూశారనడం షాక్‌కు గురి చేసిందన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

  • 21 Feb 2022 11:16 AM (IST)

    చివరి వరకు రాష్ట్ర అభివృద్ధి కోసమే..

    వారం రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించారు గౌతమ్‌రెడ్డి. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న ఆయన..ఏపీకి పెట్టుబడుల కోసం ఎంతో శ్రమించారు. ఇన్వెస్టర్లను ఏపీకి రప్పించేందుకు రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. ఏపీలో సుస్థిరమైన అభివృద్ధితో పాటు 11 రంగాలకు చెందిన 70 ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. దుబాయ్‌ పర్యటనలో 5వేల కోట్లకు పైగా పెట్టబుడతులకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.

  • 21 Feb 2022 11:13 AM (IST)

    తెలంగాణ గవర్నర్ సంతాపం

    మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ గవర్నర్, దుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • 21 Feb 2022 11:11 AM (IST)

    ఎల్లుండి నెల్లూరు లో అంత్యక్రియలు

    రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివదేహం తరలించనున్నారు. రేపు నెల్లూరులో అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుతారు. అమెరికాలో ఉన్న గౌతమ్‌రెడ్డి కుమారుడు రాగానే బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

  • 21 Feb 2022 10:46 AM (IST)

    యువనేత గౌతమ్ రెడ్డి మృతిపై ఎంపీ ఆదాల తీవ్ర దిగ్భ్రాంతి

    యువనేత మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గౌతమ్ రెడ్డి అకాల మరణం తనను ఎంతగానో కలచివేసిందని బాధను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఒక క్రమపద్ధతిలో చేస్తూ గౌతమ్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అక్కడి ప్రజలకు తీరని లోటు అన్నారు. తనకు ఆయనతో ఎంతో ఆత్మీయత ఉందని, వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

  • 21 Feb 2022 10:44 AM (IST)

    ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటుః ఎంపీ మాధవ్

    ఆయన లేకపోవడం పార్టీకే కాకుండా, రాష్ట్రానికి కూడా తీరని లోటని పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య అన్నారు. ఆయన గంభీరంగా కనిపించే మృదు స్వాభావి.. ఎప్పుడు కలిసిన ఆప్యాయంగా మాట్లాడే వారన్నారు. మంచి మిత్రున్ని కోల్పోయాం.. ఆయన రాష్ట్రానికి ఇంకా సేవలందిస్తారని అనుకున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.

  • 21 Feb 2022 10:36 AM (IST)

    నిన్నటి వరకు ఆయనతోనే ప్రయాణం చేశాః గోవిందరెడ్డి

    నిన్నటి వరకు ఆయనతోనే ప్రయాణం చేశా.. ఈలోపే ఇంత దారుణం జరిగిందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి అన్నారు. దుబాయ్ తో ఆయన కలసి వారం రోజుల పాటు పని చేశానని, ఎంతో గౌరవంగా మాట్లాడే వారన్నారు. అన్న అని సంబోధిస్తూ ఆప్యాయత చూపించే వారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చేందుకు చివరి వరకు కష్టపడ్డారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉండేవని గోవిందరెడ్డి తెలిపారు.

  • 21 Feb 2022 10:34 AM (IST)

    కలిసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్నాః మంత్రి శంకర్ నారాయణ

    మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరంపై వైసీపీ నేతల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తోటి మంత్రి, మృదు స్వభావిని కోల్పోవడం చాలా బాధగా ఉందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఆయనతో పని చేయడం చాలా మంచి అనుభూతి అన్న శంకర్ నారాయణ.. కలిసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకునే వాళ్లమన్నారు.

  • 21 Feb 2022 10:28 AM (IST)

    గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు

    హైదరాబాద్ గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అపోలో ఆసుపత్రిలో మృతిచెందిన గౌతమ్ రెడ్డి పార్ధీవదేహన్ని జూబ్లీహిల్స్ 48లోని ఆయన నివాసానికి తీసుకురావడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    3 Copy

    3 Copy

  • 21 Feb 2022 10:08 AM (IST)

    గౌతమ్‌రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటుః మంత్రి వెల్లంపల్లి

    మృదు స్వభావి, ఎంతో మంచి మనిషి అయిన మేకంపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

  • 21 Feb 2022 10:05 AM (IST)

    తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని..

    గౌతమ్ రెడ్డి తొలిసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించగా.. ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి మరోసారి ఆత్మకూరు నుంచి గెలిచారు.. తర్వాత జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గౌతమ్ రెడ్డి బాబాయి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

  • 21 Feb 2022 10:04 AM (IST)

    తొలి ప్రయత్నంలోనే విజయం

    మేకపాటి గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. అనంతరం రాజమోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఇద్దరూ వైఎస్సార్‌సీపీ నుంచి బరిలోకి దిగారు.

  • 21 Feb 2022 10:02 AM (IST)

    మృదు స్వభావి కోల్పోవడం బాధాకరంః చంద్రబాబు

    రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కలచివేసిందని.. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరమన్నారు. మంత్రివర్గంలో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.

  • 21 Feb 2022 10:01 AM (IST)

    గౌతమ్‌రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందిః జగన్

    మంత్రి గౌతమ్ రెడ్డి మరణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందన్నారు సీఎం జగన్. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

  • 21 Feb 2022 09:58 AM (IST)

    సహచరు లేడని కుంగిపోతున్నాః మంత్రి జయరాం

    మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. సహచర మంత్రి వర్గ సభ్యుడు ఇక లేరు అని తెలిసి కుంగిపోతున్న.. మంత్రి గౌతమ్ రెడ్డి కి నా కన్నీటి నివాళి అంటూ మంత్రి జయరాం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

  • 21 Feb 2022 09:56 AM (IST)

    గౌతమ్‌రెడ్డి మృతి చాలా బాధాకరంః తలసాని

    మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

  • 21 Feb 2022 09:54 AM (IST)

    రెండు సార్లు సోకిన కరోనా వైరస్

    ఎంతో మృదు స్వభావిగా పేరున్న మేకపాటి హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు గౌతమ్‌రెడ్డి. రెండు సార్లు కరోనా వైరస్ బారినపడ్డారు గౌతమ్‌రెడ్డి పోస్ట్‌ కొవిడ్‌ పరిణామాలే మేకపాటి మరణానికి కారణమని అనుమానిస్తున్నారు.

  • 21 Feb 2022 09:53 AM (IST)

    ప్రజాసేవ కోసం అంకితం..

    1971 నవంబర్‌ 2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి..ప్రస్తుతం ఏపీ పరిశ్రమలు, ఐటీ మంత్రిగా ఉన్నారు. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి..ఎమ్మెస్సీ పూర్తిచేశారు మేకపాటి గౌతమ్‌రెడ్డి. 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు. బ్రిటీష్ యూనివర్శిటీలో చదువుకున్న వ్యక్తిగా మాత్రమే కాకుండా తనకున్న ఎన్నో ఇండస్ట్రీస్ ను నడిపిన పర్శన్ గానూ ఆయనకున్న అనుభవం మొత్తాన్ని ప్రభుత్వసేవలకోసం వాడారని చెబుతున్నారు ఏపీ మంత్రులు.

  • 21 Feb 2022 09:51 AM (IST)

    టెక్నోక్రాట్‌గా ఆయనకు పేరు..

    మేకపాటి గౌతమ్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడరనీ. టెక్నోక్రాట్ గా ఆయనకు పేరుందనీ. అందుకే ఆయనకు ఐటీ మంత్రిగా అవకాశమిచ్చారనీ అంటున్నారు ఆయనతో పాటు పని చేసిన సాటి మంత్రులు. జగన్ తన మంత్రి వర్గం నుంచి ఏమి ఆశిస్తారో.. వాటిని ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటారనీ. ముఖ్యమంత్రి మానస పుత్రిక స్కిల్ డెవలప్ మెంట్ లో ఎంతో స్టడీ చేశారు.

  • 21 Feb 2022 09:50 AM (IST)

    రాష్ట్ర వ్యాప్తంగా శోకసంద్రంలో వైసీపీ శ్రేణులు

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి కనీసం కోపతాపాలు ప్రదర్శించని వ్యక్తిగా పేరుందని చెప్పుకొస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలన్న ధోరణిలో ఎక్కడా తేడా చూపేవారు కాదనీ. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరితోనూ అంతగా కలిసిపోతారనీ అంటున్నారు.

  • 21 Feb 2022 09:48 AM (IST)

    మృధుస్వభావిగా మంచి పేరు..

    గౌతమ్ రెడ్డి ఎంతో ఆరోగ్యంగా ఉంటారనీ. కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారనీ. హోటల్లో కూడా జిమ్ ఫెసిలిటీ చూసుకుంటారనీ చెబుతుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. జిల్లాలో ఎక్కడా ఎవరితోనూ వివాదాల్లేకుండా ఉంటారనీ. ఆయనెంతో మృధుస్వభావిగా చెబుతున్నారు ఆయన బంధు మిత్రులు.

  • 21 Feb 2022 09:47 AM (IST)

    నీతి నిజాయితీకి మారుపేరుః నారాయణస్వామి

    మేకపాటి మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేకపాటి హఠాన్మరణం పట్ల సంతాపం ప్రకటించారు. గౌతమ్‌రెడ్డి నీతి నిజాయితీకి మారుపేరని..ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు.

  • 21 Feb 2022 09:46 AM (IST)

    జగన్ కేబినెట్‌లో పరిశ్రమల మంత్రిగా..

    ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచి గెలిచారు.. తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు నుంచి ఎంపీగా పనిచేశారు.

  • 21 Feb 2022 09:45 AM (IST)

    యూకేలో ఉన్నత విద్య

    మేకపాటి గౌతమ్‌రెడ్డిది నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యుకె లో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి M.Sc పట్టాను పొందారు.

  • 21 Feb 2022 09:44 AM (IST)

    ఏపీకి పెట్టుబడులు కోసం దుబాయి పర్యటన

    గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు.

    1

    1

  • 21 Feb 2022 09:41 AM (IST)

    కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

    ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం ఉదయం అనారోగ్యానికి గురికావడంతో హుటా హుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు అత్యవసరంగా వైద్యం అందించారు.. అక్కడ చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. మంత్రి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

  • 21 Feb 2022 09:38 AM (IST)

    రేపు విజయవాడకు మంత్రి..

    దుబాయి పర్యటనకు వెళ్లిన మంత్రి గౌతమ్‌రెడ్డి.. రేపు విజయవాడ రావాల్సి ఉంది. సీఎం వైఎస్ జగన్‌తో భేటీకి రేపు మంత్రి అపోయింట్మెంట్ కూడా తీసుకున్నారు. దుబాయి పర్యటన వివరాలను సీఎంకు వివరించడానికి రేపు అనుమతి తీసుకున్నారు మంత్రి.

    Goutham Reddy Dubbai

    Goutham Reddy Dubbai

  • 21 Feb 2022 09:37 AM (IST)

    దుబాయి పర్యటన ముగించుకుని…

    ఈ నెల 11 నుంచి దుబాయి పర్యటనకు వెళ్లిన మంత్రి గౌతమ్‌రెడ్డి. నిన్న రాత్రి హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంసభ్యులు హుటాహుటీన హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

Published On - Feb 21,2022 9:33 AM