Minister Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.
AP Minister Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున ఛాతీ నొప్పితో కూలబడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గౌతంరెడ్డిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి వైద్యం అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే సెగ్మెంట్ నుంచి 2014లోనూ గెలుపొందారు. మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవలే దుబాయి పర్యటనకు వెళ్లి వచ్చారు గౌతమ్‌రెడ్డి.