Viral Photo: ఫోటోలో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు టాప్ హీరో.. ఆస్కార్ రేంజ్ ఈ హీరో సత్తా.. ఎవరో గుర్తుపట్టారా?
Viral Photo: సమాచార మార్పిడిలో పెను సంచలనం సోషల్ మీడియా. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సమాచార మార్పిడే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో కూడా సోషల్ మీడియా ప్రజలకు మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. ఇక సినీ తారలు కూడా..
Viral Photo: సమాచార మార్పిడిలో పెను సంచలనం సోషల్ మీడియా. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సమాచార మార్పిడే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో కూడా సోషల్ మీడియా ప్రజలకు మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. ఇక సినీ తారలు కూడా తమ అభిమానులతో టచ్‌లో ఉండడానికి సోషల్ మీడియానే వేదికగా ఉపయోగించుకుంటున్నారు. తమ చిన్ననాటి ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇలా ప్రతీ రోజూ సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు సోషల్ మీడియా క్రియేటర్స్ ప్రత్యేకంగా ఇలాంటి త్రోబ్యాక్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఈ ఫోటోలో ఉంది ఎవరో గుర్తించండి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే నెట్టింట వైరల్ అవుతోంది. పైన కనిపిస్తోన్న ఫోటోలో క్యూట్ స్మైల్‌తో కనిపిస్తున్న ఈ బుడ్డొడిని ఓసారి గమనించండి. ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీ కుర్రాడు ఓ టాప్ హీరో. తన అద్భుత నటనతో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఏకంగా ఆస్కార్ విభాగంలో ఉత్తమ నటుడి బరిలో స్థానం దక్కించుకున్నారీ హీరో.
ఇంతకీ ఈ బుడ్డొడు ఎవరంటే.. తమిళ స్టార్ హీరో సూర్య. 1997లో తమిళ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన సూర్య, ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్నారు సూర్య. ఇటీవల ‘జైభీమ్’ చిత్రంతో దేశం దృష్టిని ఆకర్షించారు. లాయర్ పాత్రలో అద్భుత నటనతో అందరినీ మెప్పించారు సూర్య.
View this post on Instagram
Tollywood: అలనాటి అందాల తార లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట వైరల్ అవుతోన్న కచ్చా బాదం సాంగ్.
Tollywood: అలనాటి అందాల తార లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట వైరల్ అవుతోన్న కచ్చా బాదం సాంగ్.