Crime News: రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. తాళి కట్టే క్షణంలో షాకిచ్చిన భార్య.. అసలు సంగతి తెలిసి..

Woman prevents husband's remarriage: అతను పెళ్లి చేసుకున్నాడు.. ఈ క్రమంలో భార్య తెలియకుండానే.. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఓ ఆలయంలో

Crime News: రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. తాళి కట్టే క్షణంలో షాకిచ్చిన భార్య.. అసలు సంగతి తెలిసి..
Marriage
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 21, 2022 | 9:57 AM

Woman prevents husband’s remarriage: అతను పెళ్లి చేసుకున్నాడు.. ఈ క్రమంలో భార్య తెలియకుండానే.. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఓ ఆలయంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంటుండగా.. భార్య.. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ షాకింగ్ ఘటన ఆదివారం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో జరిగింది. పెనుగంచిప్రోలు (penuganchiprolu) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ నల్గొండ (nalgonda) జిల్లా భువనగిరికి చెందిన చెరుకుమల్లి మధుబాబుకు హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన సరితతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. అత్తింటివారు వరకట్న వేధింపులకు పాల్పడుతుండడంతో గత మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో సరిత కేసు పెట్టగా.. దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే.. విచారణ కొనసాగుతుండగానే మధుబాబు గతంలో రెండుసార్లు వివాహం చేసుకోబోగా సరిత అడ్డుకుంది. అయితే.. ఈ సారి మధుబాబు గుట్టుచప్పుడు కాకుండా కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించుకున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం మధుబాబు వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబాలతో ప్రసిద్ధ పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి చేరుకున్నాడు. ఆలయంలో పెద్దతిరునాళ్ల కావడంతో భక్తుల సంఖ్య భారీగా ఉంది. అయితే.. బేడా మండపంలో మధుబాబు వివాహం జరుగుతుందన్న విషయం సరిత ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో సరిత కుటుంబసభ్యులతో కలిసి మధుబాబు వివాహాన్ని అడ్డుకుంది. అయితే.. గతంలో జరిగిన వివాహం గురించి పెళ్లికుమార్తె కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా మధుబాబు కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. మండపానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మధుబాబును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి ప్రశ్నించగా.. అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఈ కేసు గురించి ఇప్పటికే భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో విచారణలో ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరం లేదని.. ఇరు కుటుంబాలకు పోలీసులు సర్ది చెప్పి పంపారు.

Also Read: Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం

AP News: తినే వస్తువు అనుకొని.. జండూబామ్ డబ్బా మింగిన శిశువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?