Andhra Pradesh: జగనన్న తోడు కార్యక్రమం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!

Andhra News: ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో 22వ తేదీ మంగళవారం నాడు నిర్వహించ తలపెట్టిన ‘జగనన్న తోడు’ కార్యక్రమం వాయిదా పడింది.

Andhra Pradesh: జగనన్న తోడు కార్యక్రమం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!
Jagananna Thodu
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 21, 2022 | 5:38 PM

Jagananna Thodu:  ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutham Reddy) ఆకస్మిక మరణంతో 22వ తేదీ మంగళవారం నాడు నిర్వహించ తలపెట్టిన ‘జగనన్న తోడు’ మూడవ విడత సాయం అందజేత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28 (సోమవారానికి) కి వాయిదా వేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి  తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి  జగనన్న తోడు లబ్ధిదారుల వడ్డీ సొమ్మును తిరిగి బ్యాంకుల్లో వారి ఖాతాలలో జమ చేసే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచనగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించిందని, స్వర్గీయ మంత్రి స్వగ్రామం నెల్లూరు జిల్లా(Nellore District) మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించ తలపెట్టిన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

జగనన్న తోడు పథకం వివరాలు…

జ‌గ‌న‌న్న తోడు పథకం కింద బ్యాంకుల్లో ఒక్కోక్క చిరు వ్యాపారికి ఏటా 10 వేల రుపాయిలు వ‌ర‌కు వ‌డ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప‌ది వేల రుపాయిల‌కు ఏడాదికి అయ్యే వ‌డ్డీని ప్రభుత్వం నేరుగా ల‌బ్దిదారుల‌కు అందిస్తుంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి లభిస్తుంది. అయితే తీసుకున్న లోన్ చెల్లిస్తేనే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

Also Read: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుందా? ఇదిగో క్లారిటీ

తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!