Lalu Prasad Yadav: దాణా కుంభకోణం కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష.. CBI కోర్టు సంచలన తీర్పు
దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)కు రాంచీలోని CBI ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)కు రాంచీలోని CBI ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో పాటు లాలూకు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. 25 ఏళ్ల విచారణ తరువాత దాణా స్కాంలోని ఐదో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను గత వారం దోషిగా తేల్చడం తెలిసిందే. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని అభియోగాలు నమోదయ్యాయి. ఇది దాణా కుంభకోణంలో ఐదో కేసు మాత్రమే కాకుండా, అతిపెద్ద కేసు కూడా ఇదే. ఈ కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.
పశుగ్రాసం కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా నిలిచారు.. అయితే ఇది తుది తీర్పు కాదని , సీబీఐ కోర్టు తీర్పును లాలూ ప్రసాద్ యాదవ్ హైకోర్టులో , అవసరమైతే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆర్జేడీ నేతలు తెలిపారు.
అబే చైబాసా ట్రెజరీ నుండి 37.7 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నందుకు సంబంధించిన మొదటి కేసులో లాలూ ప్రసాద్‌కు 5 సంవత్సరాల శిక్ష పడింది. దేవఘర్ ట్రెజరీ నుంచి నిధుల ఉపసంహరణ కేసులో మూడున్నరేళ్లు శిక్ష, చైబాసా ట్రెజరీ నుండి 33.13 కోట్లు అక్రమంగా ఉపసంహరించుకున్న మూడవ కేసులో 5 సంవత్సరాల శిక్ష పడింది. దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై నాలుగో కేసులో రెండు వేర్వేరు సెక్షన్లలో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఐదో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
Also Read..
ICC T20I Rankings: తగ్గేదేలే అంటున్న హిట్‌మ్యాన్ సేన.. ఆరేళ్ల తర్వాత టీమ్ ఇండియా ఘనత..