NEET UG Counselling 2021: ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కౌన్సెలింగ్‌కు నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లోనే..
ఆల్ ఇండియా కోటా కింద నీట్ యూజీ రౌండ్ 2 కౌన్సెలింగ్ 2021 (NEET UG 2022) ప్రక్రియ ఈరోజు (ఫిబ్రవరి 21)తో ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోగా..
NEET UG Counselling 2021 Round 2 registrations to end today: ఆల్ ఇండియా కోటా కింద నీట్ యూజీ రౌండ్ 2 కౌన్సెలింగ్ 2021 (NEET UG 2022) ప్రక్రియ ఈరోజు (ఫిబ్రవరి 21)తో ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోగా అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎమ్‌సీసీ (MCC) సూచించింది. ఐతే చివరి రోజున సర్వర్ బిజీగా ఉంటుంది కాబట్టి అభ్యర్ధులు ముందుగానే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:55 నిముషాలలోగా విద్యార్ధులు తమ ఎంపికలను పూరించి, ఛాయిస్‌లను లాక్ చేయాలని సూచించారు. ఒక్కసారి ఎంపిక (Choices)లను లాక్ చేశాక తర్వాత మార్పు చేయాడానికి అనుమతి ఉండదనే విషయాన్ని విద్యార్ధులు గమనించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది.
నీట్ యుజి 2021కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
- అధికారిక వెబ్‌సైట్ www.ntaneet.nic.in.ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపించే ‘Online Registration’ లింక్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ అవ్వడానికి రోల్ నెంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అడిగిన వివరాలన్నింటినీ పూరించి సబ్‌మిట్ చేయాలి.
- చివరిగా రిజిస్ట్రేషన్‌ను చెల్లించి, రిజిస్ట్రేషన్ ఫామ్‌ను సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
కాగా అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఫిబ్రవరి 22 నుండి 23 వరకు ఆల్ ఇండియా కోటా (AIQ) రౌండ్ 2 కౌన్సెలింగ్‌కు అవసరమైన వివరాలను నమోదు చెయ్యాలి. ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించబడుతుంది. నీట్ రౌండ్ 2 కౌన్సెలింగ్ 2021కు సంబంధించిన సీట్ల కేటాయింపు ఫలితాలు ఫిబ్రవరి 26న విడుదల అవుతాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు విద్యార్ధులు తమకు సీటు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయవల్సి ఉంటుంది. ఇంతటితో రౌండ్ 2 కౌన్సెలింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత మార్చి 10 నుంచి 14 వరకు మాప్-అప్ రౌండ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మాప్-అప్ రౌండ్ తర్వాత కొత్త రిజిస్ట్రేషన్‌లకు అనుమతి ఉండదు.
కాగా నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం నాలుగు దశల (రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్)లలో జరుగుతుంది. విద్యార్ధులు మొదటి మూడు రౌండ్‌ల వరకు మాత్రమే కౌన్సెలింగ్ నమోదుకు అనుమతి ఉంటుంది. చివరి రౌండ్‌లో నమోదు చేసుకోవడానికి అనుమతి ఉండదు. మొదటి అలాట్‌మెంట్ రౌండ్‌లో సీటు రాని విద్యార్ధులు, మొదటి రౌండ్‌లో కేటాయించిన సీటును రద్దు చేసుకున్నవారు, సీటు వచ్చినా దానిని రిజెక్ట్ చేసిన విద్యార్ధులు రెండో దశ కౌన్సెలింగ్‌కు అర్హత కలిగి ఉంటారు.
Also Read: