IRCON Recruitment: ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

IRCON Recruitment: ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IRCON Recruitment: ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేలకు పైగా జీతం పొందే అవకాశం..
Ircon Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 21, 2022 | 10:58 AM

IRCON Recruitment: ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 389 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* సీనియర్‌ వర్క్స్‌ ఇంజనీర్‌ (సివిల్‌, ఎస్‌ అండ్‌ టీ) – 31, వర్క్స్‌ ఇంజనీర్‌ (సివిల్‌) 326, సైట్‌ సూపర్‌వైజర్లు – సివిల్‌ (01), వర్క్స్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) 09, వర్క్స్‌ ఇంజనీర్‌ (ఎస్‌ అండ్‌ టీ) 21, జియాలజిస్ట్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎమ్మె్స్సీ/ ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* సంబంధిత రాష్ట్రాల ఇర్కాన్‌ కార్యాలయాల్లో వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Alert: స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. సేవలు పొందాలంటే అలా చేయడం ఇక తప్పనిసరి.. ట్విట్టర్ లో SBI ఏమి చెప్పిందంటే..

Viral Video: మరీ చీర కోసం ఇంత రిస్క్‌ చేయ్యాలా..? సోషల్ మీడియాలో ఆ మహిళను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్స్‌.. వీడియో

Alert: స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. సేవలు పొందాలంటే అలా చేయడం ఇక తప్పనిసరి.. ట్విట్టర్ లో SBI ఏమి చెప్పిందంటే..