ICC T20I Rankings: తగ్గేదేలే అంటున్న హిట్‌మ్యాన్ సేన.. ఆరేళ్ల తర్వాత టీమ్ ఇండియా ఘనత..
ICC T20I Rankings: రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక టీమ్ ఇండియా అరుదైన రికార్డులని నమోదు చేస్తుంది. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో గెలుపొందిన
ICC T20I Rankings: రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక టీమ్ ఇండియా అరుదైన రికార్డులని నమోదు చేస్తుంది. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో గెలుపొందిన టీమిండియా నెం1 జట్టుగా అవతరించింది. సరిగ్గా ఆరేళ్ల తర్వాత మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ను ఏకపక్షంగా ఓడించిన భారత్ అంతకుముందు వన్డే సిరీస్‌ను గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారతదేశం రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించింది. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా టీ 20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.
ఇక భారత జట్టును టీ20ల్లో నెం1 గా నిలిపిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2016లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో భారత జట్టు టీ20ల్లో నెం1గా నిలిచింది. ఆదివారం విండీస్‌తో జరిగిన మ్యాచ్ టీ20 కెప్టెన్‌గా రోహిత్‌కి 21వ విజయం. దీంతో తొలి 25 టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. 15 టీ 20లతో విరాట్ కోహ్లి రెండో స్థానంలోనూ, 12 మ్యాచ్‌లతో మహేంద్ర సింగ్ ధోనీ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు.
రోహిత్ టీ20ల్లో భారత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వరుసగా రెండో టీ20 సిరీస్ విజయం. అదే విధంగా టీ20 ఫార్మాట్‌లో మూడు లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్‌లను వైట్‌వాష్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇక స్వదేశంలో విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. 270 పాయింట్లు సాధించి ఇంగ్లండ్‌ను వెనుక్కి నెట్టి నెం1 గా నిలిచింది. 269 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ ఓటమితో వెస్టిండీస్ కూడా రికార్డు సృష్టించింది. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్టుగా నిలిచింది.