IPL 2022 Auction: ఆ ఆటగాడిపై భారీగా పందెం ఖాయడం రిస్కే.. కానీ, మాకు వేరే దారిలేదు: ఎస్‌ఆర్‌హెచ్ కోచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కోచ్ మురళీధరన్ ఈ ఆటగాడిని కొనుగోలు చేయడానికి గల కారణాన్ని చెప్పాడు.

IPL 2022 Auction: ఆ ఆటగాడిపై భారీగా పందెం ఖాయడం రిస్కే.. కానీ, మాకు వేరే దారిలేదు: ఎస్‌ఆర్‌హెచ్ కోచ్
Ipl 2022
Follow us
Venkata Chari

|

Updated on: Feb 21, 2022 | 3:01 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌(Nicholas Pooran)ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. నిజానికి, ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐపీఎల్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేడు. కానీ, దీని తర్వాత కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ పూరన్ కోసం దాదాపు రూ.11 కోట్లు ఖర్చు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఎందుకు ఇలా చేసింది ? ఈ ప్రశ్నకు ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) సమాధానం ఇచ్చాడు. ముత్తయ్య మురళీధరన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇషాన్ కిషన్, నికోలస్ పూరన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేశాం. కానీ, ఇషాన్‌ను ముంబై టీం తీసుకోవడంతో వెస్టిండీస్ ఆటగాడిపై భారీగా పందెం వేయాల్సి వచ్చింది.

స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీధరన్ మాట్లాడుతూ, “మేం ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేయాలనుకున్నాం. అయితే బిడ్ మా బడ్జెట్‌కు మించి వెళ్ళింది. మేం ఇతర ప్లేయర్ల కోసం వెతకడం ప్రారంభించాం. జానీ బెయిర్‌స్టో అందుబాటులో ఉన్నాడు. కానీ, అతను మొత్తం సీజన్‌లో ఉంటాడా లేదా అనే సందేహం మాకు ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఆడగల అంతర్జాతీయ వికెట్ కీపర్ మాకు కావాలి. కాబట్టి పూరన్ మంచి ఛాయిస్ అని అనుకున్నాం” అని పేర్కొన్నాడు.

నికోలస్ పూరన్‌ను కొనుగోలు చేయడం పెద్ద రిస్క్‌గా అయినా.. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో, ఈ వెస్టిండీస్ ఆటగాడు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉపశమనం కలిగించాడు. నికోలస్ పూరన్ టీ20 సిరీస్‌లో అత్యధికంగా 184 పరుగులు చేశాడు. పూరన్ సగటు 61కి పైగా ఉంది. మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగాను నిలిచాడు. దీనితో పాటు, అతని బ్యాట్ నుంచి గరిష్టంగా 17 ఫోర్లు కూడా వచ్చాయి. టీ20 సిరీస్‌లో పూరన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తన విమర్శకుల నోరు మూయించాడు.

పూరన్ ఐపీఎల్ రికార్డులు ఎలా ఉన్నాయంటే? నికోలస్ పూరన్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 33 మ్యాచ్‌లు ఆడి 606 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 22.44గా ఉంది. గత సీజన్‌లో, నికోలస్ పూరన్ 12 మ్యాచ్‌ల్లో 7.72 సగటుతో 85 పరుగులు చేశాడు. మొత్తం సీజన్‌లో అతను 5 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. ఇదిలావుండగా, ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌కు వేలంలో భారీ మొత్తం లభించడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Also Read: ICC T20I Rankings: తగ్గేదేలే అంటున్న హిట్‌మ్యాన్‌ సేన.. ఆరేళ్ల తర్వాత టీమ్‌ ఇండియా ఘనత..

కేవలం 2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్.. ఎవరో తెలుసా?

పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. చెక్ చేయగా !!
బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. చెక్ చేయగా !!
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!