AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: జంతువుల వేలం కంటే దారుణంగా ఉంది.. పద్ధతి మార్చండి: ఐపీఎల్ వేలంపై చెన్నై ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

IPL 2022 వేలంలో రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్ల బేస్ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో కూడా అతను అదే జట్టులో ఉన్నాడు.

IPL 2022: జంతువుల వేలం కంటే దారుణంగా ఉంది.. పద్ధతి మార్చండి: ఐపీఎల్ వేలంపై  చెన్నై ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
Robin Uthappa
Venkata Chari
|

Updated on: Feb 21, 2022 | 4:52 PM

Share

ఐపీఎల్ వేలం గురించి రాబిన్ ఉతప్ప(Robin Uthappa) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వేలం పాటను చూస్తుంటే ఆటగాళ్లందరికీ ఏదో వస్తువును వేలం వేస్తున్నట్లు అనిపిస్తోందని, ఆ మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించాడు. ఇది చూడ్డానికి అస్సలు బాగోలేదు. రాబిన్ ఉతప్ప ఇటీవల IPL 2022 వేలం(IPL 2022 Auction)లో భాగమయ్యాడు. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌తో జతకట్టాడు. మరోసారి చెన్నై తరఫున ఆడే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. IPL 2021లో CSK(Chennai Super Kings) తరపున ఉతప్ప కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. తొలి క్వాలిఫయర్‌లో 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

తాను, తన కుటుంబం CSKలో భాగం కావాలని ఆశిస్తున్నట్లు రాబిన్ ఉతప్ప అంగీకరించాడు. ఈ మేరకు న్యూస్ 9 తో మాట్లాడుతూ , ‘సీఎస్‌కే వంటి జట్టు కోసం ఆడాలనేది నా కోరిక. మళ్లీ CSKలో చేరాలన్నది నా ఏకైక ప్రార్థన. నా కుటుంబం, నా కొడుకు కూడా దాని కోసం ప్రార్థించారు. నేను సురక్షితంగా, గౌరవంగా భావించే జట్టులోకి వెళ్లడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు.

జంతువుల వేలంలా అనిపిస్తోంది.. రాబిన్ ఉతప్ప 2006 నుంచి 2015 మధ్యకాలంలో భారత్ తరఫున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో వేలానికి బదులు డ్రాఫ్ట్ పాలసీని తీసుకరావాలని ఈ ప్లేయర్ సమర్థించాడు. ‘వేలంలో మీరు చాలా కాలం క్రితం పరీక్ష పెట్టి, ప్రస్తుతం ఫలితం రాబోతున్నట్లుగా ఉంది. ఫ్రాంచైజీలు పెంపుడు జంతువుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చూడ్డానికి అంత మంచిగా కనిపించడం లేదు. ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎవరి పెర్ఫార్మెన్స్‌పై వారి అభిప్రాయాలు వేరుగా ఉంటాయన్నది వేరే విషయం. అయితే ఎవరు ఎంతకి అమ్ముతారనేది పూర్తిగా భిన్నమైన విషయమని’ అని పేర్కొన్నాడు.

‘అమ్ముడుపోని ఆటగాళ్ల పరిస్థితి ఏమవుతుందో ఊహించలేరు. ఇది మంచి అనుభూతి కాదు. చాలా కాలం పాటు వేలంలో నిలిచినా.. ఏ జట్టులోకి ఎంపిక కాని ఆటగాళ్లకు నా ప్రగాఢ సానుభూతి. కొన్నిసార్లు ఇది చాలా నిరాశపరుస్తుందనడంలో సందేహం లేదు’ అని తెలిపాడు.

అందరికీ మేలు జరిగేలా ముసాయిదా విధానం ఉండాలని అన్నారు. అది చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఐపీఎల్ 2022లో ఆడడం గురించి రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ, సీఎస్‌కేతో తన కెరీర్‌ను ముగించాలనుకుంటున్నాను. అదే జరిగితే అంతకన్న గొప్ప విషయం మరొకటి ఉండదు’ అని తెలిపాడు.

Also Read: IPL 2022 Auction: ఆ ఆటగాడిపై భారీగా పందెం ఖాయడం రిస్కే.. కానీ, మాకు వేరే దారిలేదు: ఎస్‌ఆర్‌హెచ్ కోచ్

ICC T20I Rankings: తగ్గేదేలే అంటున్న హిట్‌మ్యాన్‌ సేన.. ఆరేళ్ల తర్వాత టీమ్‌ ఇండియా ఘనత..