కేవలం 2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్.. ఎవరో తెలుసా?
టీ20 క్రికెట్ అంటేనే బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తారు. బ్యాటర్ల విజృంభణతో బౌండరీల మోత మోగుతుంది. అయితే ఎప్పుడూ బ్యాట్స్‌మెన్లే...
టీ20 క్రికెట్ అంటేనే బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తారు. బ్యాటర్ల విజృంభణతో బౌండరీల మోత మోగుతుంది. అయితే ఎప్పుడూ బ్యాట్స్‌మెన్లే సఫలం అవుతారానుకోవడం పొరపాటే.. టార్గెట్‌ను చేధించకుండా ప్రత్యర్ధి జట్టును కట్టడి చేయడంలో బౌలర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. కొన్నిసార్లు ఫాస్ట్ బౌలర్లు ప్రతాపం చూపిస్తే.. మరికొన్ని సార్లు లెగ్ స్పిన్నర్లు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు. తాజాగా టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓ లెగ్ స్పిన్నర్ అరుదైన రికార్డును సృష్టించాడు. కేవలం 2 ఓవర్లలోనే ప్రత్యర్ధి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. జర్మనీ, బహ్రెయిన్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో 28 ఏళ్ల లెగ్ స్పిన్నర్ జునైద్ అజీజ్ తన స్పిన్ మాయాజాలంతో చెలరేగిపోయాడు.
జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో బహ్రెయిన్ జట్టుకు చెందిన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ జునైద్ అజీజ్ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లు తీయడం ఏముంది..! ఇప్పటికే టీ20ల్లో చాలామంది బౌలర్లు తీశారు కదా అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఓ స్పెషాలిటీ ఉంది.. అజీజ్ 10 బంతుల్లోనే 5 వికెట్లు తీశాడు. అతడు తన కోటాలోని 2 ఓవర్లు పూర్తి చేయక ముందే జర్మనీ జట్టులోని సగం మంది బ్యాటర్లు డగౌట్ చేరారు. దీనితో అజీజ్ టీ20 క్రికెట్‌లో 2 ఓవర్లలోపు 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, ఈ మ్యాచ్‌లో జునైద్ అజీజ్ దెబ్బకు జర్మనీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 107 పరుగుల లక్ష్యాన్ని బహ్రెయిన్ జట్టు 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
1 2 W W . W 2 W . W
Bahrain’s Junaid Aziz delivered a dream spelling taking five wickets in 10 balls against Germany! ?#T20WorldCup pic.twitter.com/a33aPdlqIU
— T20 World Cup (@T20WorldCup) February 19, 2022
Also Read: Viral Video: బండిని రివర్స్ చేశాడు.. సీన్ కాస్తా రివర్స్ అయింది.. వీడియో చూస్తే షాకే.!