Viral Video: బండిని రివర్స్ చేశాడు.. సీన్ కాస్తా రివర్స్ అయింది.. వీడియో చూస్తే షాకే.!

జీవితంలో ఊహించని ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరగాల్సింది జరగకమానదు. క్షణాల్లో బ్రతుకు..

Viral Video: బండిని రివర్స్ చేశాడు.. సీన్ కాస్తా రివర్స్ అయింది.. వీడియో చూస్తే షాకే.!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 19, 2022 | 12:24 PM

జీవితంలో ఊహించని ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరగాల్సింది జరగకమానదు. క్షణాల్లో బ్రతుకు జీవుడా అనుకేలా పలు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిని మీరూ చూసే ఉంటారు. ఇక ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఓ మనిషి ఒకటి అనుకుంటే.. మరొకటి జరిగింది. దాన్ని చూశాక మీరు కూడా షాక్ అవ్వడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి షాప్ ఎదుట పార్క్ చేసి ఉన్న తన ట్రాలీ ఆటోను రివర్స్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక అతడు రివర్స్ చేశాడో.. లేదో మొత్తం సీన్ కాస్తా రివర్స్ అయిపోతుంది. ఆ వ్యక్తి ఎటువైపు ఆటోను రివర్స్ చేస్తాడో.. అక్కడ ఉన్న సిమెంట్ పలకలు(ప్లేట్లు) విరిగిపోతాయి. దీనితో ఆ ట్రాలీ ఆటో మురికి కాలువలో పడిపోతుంది. ఇక ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు అతడికేం గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, ఈ వీడియోను ‘వైరల్ హాగ్’ అనే ట్విట్టర్ ఖాతా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.

Also Read:

Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!

Viral News: ఇల్లు శుభ్రం చేస్తుండగా బయటపడ్డ పురాతన ట్రంక్ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా షాక్.!

Cricket: 77 బంతుల్లో 155 పరుగులు.. ఇద్దరు వికెట్ కీపర్ల పెను విధ్వంసం.. 6గురి బౌలర్ల ఊచకోత.!