హౌసింగ్ సొసైటీలో స్థలాలు ఇప్పిస్తానంటూ 13 మంది పోలీసులనే మోసం చేసిన కేటుగాడు.. మొత్తం 1.5 కోట్లు వసూలు
అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు తొక్కుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. హౌసింగ్ సొసైటీలో స్థలాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఏకంగా 13 మందిని పోలీసులను
అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు తొక్కుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. హౌసింగ్ సొసైటీలో స్థలాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఏకంగా 13 మందిని పోలీసులను మోసం చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీ అండ్ ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సీఐడీకో) తక్కువ డబ్బులతో స్థలాలు అందిస్తోందని, హౌసింగ్ సొసైటీలను నిర్మిస్తోందని ముంబైకి చెందిన సచిన్ పవర్ అనే వ్యక్తి ఓ పోస్టు పెట్టాడు. స్థలాల కోసం సీఐడీకో లాటరీ తీస్తోందని ఆ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో సతీష్ మిసల్ ఈనే పోలీసు కానిస్టేబుల్ సచిన్‌ను సంప్రదించాడు. సీఐడీకోతో తనకు సంబంధాలున్నాయని, కొంత డబ్బు పెట్టుబడిగా పెడితే స్థలం ఇప్పిస్తానని సచిన్ ఆ పోలీసును నమ్మబలికాడు. దీంతో అతను అంగీకరించాడు. సచిన్ అంతటితో ఆగకుండా ఖరఘర్ పోలీసు స్టేషన్‌లోని మరి కొంత మంది పోలీసులకు వల వేశాడు.
25 మంది గ్రూపుగా ఏర్పడి హౌసింగ్ సొసైటీ నిర్మించవచ్చని వారితో చెప్పుకొచ్చాడు. దీంతో వారు ఓ సొసైటీగా ఏర్పడ్డారు. సచిన్ ఓప్రైవేటు బ్యాంకులో అకౌంట్ తెరిచి ప్రతీ సభ్యుడి వద్ద నుంచి రూ.1.35 లక్షలు వసూలు చేశాడు. కొద్ది రోజుల తర్వాత సతీష్ సీఐడీకో లక్కీ డ్రాలో పాల్గొన్నాడు. సచిన్ చొరవ లేకుండా లక్కీ డ్రాలో వీరి సొసైటీకి కలబొలిలో ఓ ప్లాట్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి ఆ వ్యక్తిని నిలదీయగా, మాట దాట వేసే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సైచిన్ సొసైటీ ఖాతాను క్లోజ్ చేశాడు. అయితే సచిన్ పవర్ తన అకౌంట్‌ను క్లోజ్ చేయలేదు. వేరే పనుల నిమిత్తం సతీష్‌తో చెక్కులపై సంతకం పెట్టించుకున్న సచిన్.. సొసైటీ అకౌంట్ నుంచి రూ.1.5 కోట్లు కాజేశాడు. ఇది గమనించిన సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ కూడా చదవండి :
Bengaluru Crime : మంచం కింద ఆరు గంటల పాటు దాక్కొని మట్టుబెట్టాడు.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..