Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి
Maharashtra Road Accident మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మరణించారు. మరో ఎనిమిది మందికి..
Maharashtra Road Accident మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మరణించారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి 8గంటలకు బీడ్-పార్లీ హైవేపై ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలో వాద్వానీ తహసీల్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం ఆటోరిక్షాలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంతో అతివేగంగా వచ్చిన ట్రక్కు.. ఆటోరిక్షాతోపాటు కారు, ద్విచక్రవాహనాన్ని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షాలో ఉన్న ఐదుగురు మరిణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు.
అయితే గాయపడిన ఎనిమిది మందిలో.. ఐదుగురు రిక్షాలో ప్రయాణిస్తున్న వారని.. మరో ఇద్దరు కారులో, ఒకరు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారని తెలిపారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులు కొంతమందిని బీడ్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించగా, మరికొంతమందిని ఔరంగాబాద్‌కు తరలించినట్లు తెలిపారు.
ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్ పారిపోయాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: