Acid Attack: మెదక్ జిల్లాలో దారుణం.. మహిళపై యాసిడ్ దాడి..
Acid attack on a woman in medak dist: మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి..
Acid attack on a woman in medak dist: మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి మహిళపై యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని అల్లాదుర్గం మండలం పెద్దపూర్ గ్రామంలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. కాలిన గాయాలతో గ్రామంలో పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని 108 వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు.
బాధితురాలు టేక్మాల్ మండలం మార్కాపూర్ తండావాసిగా గుర్తించారు. తండాకు చెందిన మహిళ నిన్న సాయంత్రం సంతకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమెపై యాసిడ్ దాడి ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనే విషయాలు ఇంకా తెలియ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: