AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మం జిల్లాలో విషాదం.. మూడో పెళ్లి చేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి..

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లాలో విషాదం.. మూడో పెళ్లి చేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి..
Balaraju Goud
|

Updated on: Mar 08, 2021 | 1:51 PM

Share

Married women suspected death : ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిన మహిళ ఊరి చివర బావిలో శవమై తేలింది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల తెలిపిన కథనం ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన మాణిగ భాస్కర్‌ అలియాస్‌ బజార్‌ కోదాడ మండల ద్వారాకుంట గ్రామానికి చెందిన శైలజ (27)ను సుమారు ఐదేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో నిత్యం ఘర్షణ పడుతుండేవారు. దీంతో శైలజ తరచూ పుట్టింటింకి వెళ్తుండేది.

ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం కూడా భార్యాభర్తలిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన శైలజ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె కనిపించపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతుకుతున్నారు. కాగా, కొందరు రైతులు ఆదివారం పాలడుగు సమీపం నుంచి వెళ్తుండగా బావిలో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించారు. బావి వద్దకు వెళ్లి చూడగా మహిళ మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని వెలికితీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.

ఆ డెడ్‌బాడీ శైలజాదిగా గుర్తించిన పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా.. వారు శనివారం మధ్యాహ్నం వరకు ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త ఆచూకీ లభించకపోవడంతో ఈ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Also …. 

 Balakrishna : సంక్షేమ పథకాల కోసం వైసీపీ నేతల జేబులో డబ్బులు ఖర్చు చేయడం లేదు, బెదిరిస్తే నిలదీయండి : బాలకృష్ణ

మహిళలే మహారాణులు.. అంతా తామై పరిపాలిస్తున్నారు.. మగవారికి నో ఎంట్రీ అంటున్న మగువలు

అస్తమించిన మరో తెలంగాణ ఉద్యమకారుడు.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొల్లూరు తుదిశ్వాస