AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్తమించిన మరో తెలంగాణ ఉద్యమకారుడు.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొల్లూరు తుదిశ్వాస

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మ‌రో ఉద్య‌మ కారుడు అస్తమించాడు. తెలంగాణ తొలి, మ‌లి ద‌శ ఉద్య‌మాల్లో కీల‌క పాత్ర పోషించిన డాక్ట‌ర్ కొల్లూరు..

అస్తమించిన మరో తెలంగాణ ఉద్యమకారుడు.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొల్లూరు తుదిశ్వాస
K Sammaiah
|

Updated on: Mar 08, 2021 | 11:50 AM

Share

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మ‌రో ఉద్య‌మ కారుడు అస్తమించాడు. తెలంగాణ తొలి, మ‌లి ద‌శ ఉద్య‌మాల్లో కీల‌క పాత్ర పోషించిన డాక్ట‌ర్ కొల్లూరు చిరంజీవి (74) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌చ్చిబౌలిని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మృతిప‌ట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

ఇటీవలే తీవ్ర ఆస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు కొల్లూరి. దీంతో ఆయ‌న కుటుంబం ఆస్ప‌త్రి ఖ‌ర్చులు భ‌రించ‌లేని స్థితిలో ఉంద‌ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి రూ. 10 ల‌క్ష‌లు మంజూరు చేయించారు. రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్వ‌యంగా హాస్పిట‌ల్‌కు వెళ్లి.. ప్ర‌భుత్వ స‌హాయాన్ని అంద‌జేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు.

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మరణం పట్ల చిరంజీవి మృతి ప‌ట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. డాక్టర్‌గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమని కేసీఆర్ కొనియాడారు.

కొల్లూరి చిరంజీవి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, మలిదశ ఉద్యమంలోనూ తన గొంతుక వినిపించారన్నారు. చిరంజీవి మృతి తెలంగాణకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉన్నత విద్యావంతుడైన కొల్లూరి చిరంజీవి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారని… ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కేటీఆర్ అన్నారు.

Read More:

గుత్తాకు గుండె నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.. పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్‌ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు

కేరళపై కన్నేసిన జాతీయ పార్టీలు.. పట్టుకోసం ఒకరు.. విస్తరణ కోసం మరొకరు.. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి