నిరసనల్లో మేమూ, మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ శివార్లలో పోటెత్తనున్న మహిళా రైతులు

రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రి, ఘాజీపూర్ బోర్డర్స్ లో సోమవారం మహిళా రైతులు..

నిరసనల్లో మేమూ, మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ శివార్లలో పోటెత్తనున్న మహిళా రైతులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2021 | 12:06 PM

రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రి, ఘాజీపూర్ బోర్డర్స్ లో సోమవారం మహిళా రైతులు..వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తు ప్రసంగించనున్నారు. ఈ ప్రొటెస్ట్ లో విద్యార్థినులు, యాక్టివిస్టులు కూడా పాల్గొనబోతున్నారని రైతు సంఘాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగంలో మహిళలు కూడా తమ వంతు కృషి చేస్తున్నారని, కానీ దీన్ని గుర్తించేందుకు సమాజం ముందుకు రావడంలేదని సంయుక్త కిసాన్ మోర్చా సభ్యురాలు కవితా కురుగ్రంధి తెలిపారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వందలాది మహిళలు ఈ ఆందోళనకు దిగుతారని, సింఘు బోర్డర్లో తాము మార్చ్ నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఇప్పటికే ముఖ్యంగా పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో మహిళా రైతులు ఈ సరిహద్దులకు చేరుకుంటున్నారని ఆమె వెల్లడించారు.

కాగా తనతో బాటు అనేకమందిని ఈ నిరసన శిబిరాలకు తీసుకువచ్చినట్టు హర్యానాలో  భివానీకి చెందిన కవితా ఆర్య అనే 27 ఏళ్ళ యువతి తెలిపింది. వ్యవసాయ చట్టాల గురించి మహిళలు ప్రసంగిస్తారని, ఇవి రైతులకు ఎలా హాని చేస్తాయో వివరిస్తారని ఆమె వెల్లడించారు. ఈ చట్టాలలోని  లొసుగులను ప్రస్తావిస్తూ కొందరు పాటలు పాడుతారని, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరిగే అవకాశం ఉందని కవితా ఆర్య పేర్కొన్నారు. మహిళల్లో క్రమంగా చైతన్యం పెరుగుతోందనడానికి ఈ రైతు ఉద్యమంలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కూడా పాల్గొనడానికి ముందుకు రావడమే నిదర్శనమని అంటున్నారు. గ్రామాల్లో ఉన్న స్త్రీలు సైతం తమకు ఎవరూ చెప్పకుండానే, ఎవరూ సూచించకుండానే తమకు తాముగా ఈ ఆందోళనకు మద్దతు తెలపడం విశేషమని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ శివార్లలోని మూడు సరిహద్దులు వేలాది మహిళలతో నిండుతున్నాయి. పలువురు ట్రాక్టర్లలో ఇక్కడికి చేరుకుంటున్నారు. వేదికనెక్కి ప్రసంగించేవారిలో విద్యార్థినులు కూడా ఉంటారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

Baba Kamble Dance : ఆటో డ్రైవర్ డ్యాన్స్ అదుర్స్.. నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో.. ఒక్క రోజులో లక్షల వ్యూస్..

అస్తమించిన మరో తెలంగాణ ఉద్యమకారుడు.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొల్లూరు తుదిశ్వాస

గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..
గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
ఒంటరి మహిళలకు సొంతిల్లు ఉండాలా? అద్దెకుంటే నష్టం ఏంటి?
ఒంటరి మహిళలకు సొంతిల్లు ఉండాలా? అద్దెకుంటే నష్టం ఏంటి?
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..
చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.
చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు
SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు