రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు.. ఆజాద్‌ స్థానంలో ఖర్గేను ప్రతిపాదించిన కాంగ్రెస్‌

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత‌ మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ప్రతిపక్ష నేతగా కొనసాగిన గులాం న‌బీ ఆజాద్ రాజ్యసభ ప‌ద‌వీకాలం..

రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు.. ఆజాద్‌ స్థానంలో ఖర్గేను ప్రతిపాదించిన కాంగ్రెస్‌
Follow us
K Sammaiah

|

Updated on: Mar 08, 2021 | 12:14 PM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత‌ మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ప్రతిపక్ష నేతగా కొనసాగిన గులాం న‌బీ ఆజాద్ రాజ్యసభ ప‌ద‌వీకాలం ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆజాద్ స్థానంలో త‌మ పార్టీ నేత మ‌ల్లికార్జున‌ ఖ‌ర్గే పేరును కాంగ్రెస్ ప్ర‌తిపాదించింది. దీంతో ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఈ రోజు బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఆజాద్‌ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పేరును ప్ర‌తిపాదించింది. ఈ మేర‌కు రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడుకు కాంగ్రెస్ పార్టీ స‌మాచారం అందించింది. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గులాం న‌బీ ఆజాద్ రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్నారు. అయితే ఆజాద్ ప‌ద‌వీకాలం ఈ నెల 15తో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆజాద్ స్థానంలో ఖ‌ర్గే పేరును కాంగ్రెస్ ఖ‌రారు చేసింది. ఆజాద్‌తో పాటు న‌జీర్ అహ్మ‌ద్ లవాయ్‌(పీడీపీ) ప‌ద‌వీ కాలం కూడా 15తో ముగియ‌నుంది. ఆజాద్ సేవ‌ల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌ధాని మోదీ.. రాజ్య‌స‌భ‌లో భావోద్వేగానికి గురైన విష‌యం తెలిసిందే.

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం స‌భ త‌ర‌పున ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు చెప్పారు. దేశంలో గొప్ప‌ అనుభ‌వం ఉన్న నాయ‌కుల‌లో ఖ‌ర్గే ఒక‌రని వెంక‌య్య కొనియాడారు. కాగా, రెండో విడ‌త పార్ల‌మెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా నేటి నుంచి నెల రోజు పాటు ఈ స‌మావేశాలు కొన‌సాగుతాయి.

ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. వాటిల్లో ముఖ్యంగా పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు కూడా ఉన్నాయి. త్వరలో దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడీవేడీగా కొనసాగే అవ‌కాశం ఉంది.

కాగా, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళ‌న‌కు దిగారు. చ‌మురు ధ‌ర‌ల పెంపుపై చ‌ర్చ‌కు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మాట్లాడుతూ.. పెట్రోలు లీట‌ర్‌కు రూ. 100, డిజీల్ లీట‌ర్‌కు రూ. 80 చొప్పున పెరిగింద‌న్నారు. ఎల్పీజీ ధ‌ర‌లు కూడా పెర‌గ‌డంతో సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీ పేరిట రూ. 21 ల‌క్ష‌లు వ‌సూలు చేశార‌ని తెలిపారు. పెరిగిన ధ‌ర‌ల‌తో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఖ‌ర్గే పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల తొలిరోజే రాజ్యసభ స్తంభించడం ఆసక్తిగా మారింది. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.

Read More:

కేరళపై కన్నేసిన జాతీయ పార్టీలు.. పట్టుకోసం ఒకరు.. విస్తరణ కోసం మరొకరు.. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

సినీ గ్లామర్‌ను దట్టిస్తున్న పార్టీలు.. బెంగాల్లో రసవత్తరంగా పాలిటిక్స్‌.. బీజేపీ గాలానికి చిక్కిన మిథున్‌

కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్‌ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..